ఆంధప్రదేశ్ సీఎం వైఎస్‌ జగన్‌కు సీబీఐ కోర్టు శుక్రవారం నాడు షాకిచ్చింది. విచారణకు హాజరు కావాల్సిందేనని కోర్టు తేల్చి చెప్పింది.

వ్యక్తిగత హాజరు నుండి మినహాయింపు ఇవ్వాలని ఈడీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను శుక్రవారం నాడు కోర్టు కొట్టేసింది. సీబీఐ కోర్టులో విచారణ సమయంలో తనతో సహ నిందితులు హాజరు అవుతారని కోర్టుకు సీఎం జగన్ ప్రకటించారు.

Also read:ఆస్తుల కేసులో కోర్టుకు సీఎం జగన్ గైర్హాజర్: అబ్సెంట్ పిటిషన్ దాఖలు

అయితే ఈ పిటిషన్‌ను శుక్రవారం నాడు కోర్టు కొట్టేసింది. గతంలో సీబీఐ కోర్టు కూడ వ్యక్తిగత మినహాయింపుకు సంబంధించి కోర్టుకు సంబంధించి దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టేసింది. ఈడీ కేసు విచారణను కోర్టు ఈ నెల 31వ తేదీకి వాయిదా వేసింది. 

ఈ నెల 31వ తేదీ నుండి ఈడీ దాఖలు చేసిన చార్జీషీట్లపై ట్రయల్స్ ప్రారంభం కానున్నాయి. ఈ ట్రయల్స్‌పై విచారణను పురస్కరించుకొని వ్యక్తిగత హాజరు నుండి మినహాయింపు ఇవ్వాలని కోర్టును కోరారు.. 

తన తరపున జగతి పబ్లికేషన్స్ ప్రతినిధులు కోర్టుకు హాజరు అవుతారని కోర్టుకు జగన్ చెప్పారు. సీఎంగా ఉన్నందున  తాను  కోర్టుకు హాజరు కావడం వల్ల ప్రజాధనం దుర్వినియోగం అయ్యే అవకాశం ఉందని సీఎం దాఖలు చేసిన పిటిషన్ లో పేర్కొన్నారు.

పాలనా వ్యవహరాల్లో తాను బిజీగా ఉన్నందున తాను  ప్రతి వారం కోర్టుకు హాజరు కావడం వల్ల ఇబ్బందికర పరిస్థితులు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయని జగన్ కోర్టును కోరారు. అయితే ఈ విషయమై  జగన్ వాదనతో సీబీఐ కోర్టు ఏకీభవించలేదు. వ్యక్తిగతంగా కోర్టుకు హాజరుకావాల్సిందేనని కోర్టు తేల్చి చెప్పింది. జగన్ దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టేసింది..11 ఛార్జీషీట్లపై  కోర్టులో ట్రయల్స్ ఈ నెల 31వ తేదీ నుండి ప్రారంభం కానున్నాయి.