సోమాజీగూడలో అర్థరాత్రి రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఒకరి పరిస్థితి విషమంగా ఉండగా..  మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.  సోమాజీగూడ నుంచి రాజ్ భవన్ వెళ్లే దారిలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

అతి వేగంగా వచ్చిన జీప్ రోడ్డు పక్కనే ఉన్న దర్గాను ఢీ కొట్టడంతో జీప్ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో నలుగురికి తీవ్రగాయాలయ్యాయి. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. క్షతగాత్రులను  చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వారు సోమాజీగూడలోని యశోద ఆస్పత్రిలో చికిత్స  పొందుతున్నారు.

సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలికి చేరుకొని రోడ్డుపై ఉన్న జీప్ ని తొలగించారు. ఈ మేరకు కేసు నమోదు  చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు చెప్పారు. కాగా.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.