బైక్ కొనుక్కోవడానికి చెవి కమ్మలు ఇవ్వలేదని కన్నతల్లినే కర్కశంగా కడతేర్చాడో తనయుడు. ఈ దారుణ ఘటన మెదక్ లో జరిగింది. 

మెదక్ : two-wheelerన్ని కొనుగోలు చేసేందుకు Ear piercings ఇవ్వలేదనే కోపంతో ఒక కొడుకు తన తల్లి గొంతు నులిమి murder చేశాడు. ఈ సంఘటన medak జిల్లా నిజాంపేట మండలంలోని నార్లపూర్ గ్రామంలో జరిగింది. నిజాంపేట ఏఎస్ఐ ప్రతాప్ తెలిపిన వివరాల ప్రకారం.. నిజాంపేట మండలం నార్లాపూర్ గ్రామానికి చెందిన మిరుదొడ్డి పోచమ్మ (76) కు ఇద్దరు కుమారులు చిన్న కుమారుడు కుమార్ గ్రామంలో జులాయిగా తిరుగుతున్నాడు. కాగా సోమవారం రాత్రి పోచమ్మ చిన్న కుమారుడు తనకు ద్విచక్రవాహనం కావాలని అందుకు చెవి కమ్మలు ఇవ్వమని తల్లితో వాగ్వాదానికి దిగాడు. 

తల్లి చెవి కమ్మలు ఇవ్వడానికి నిరాకరించడంతో కుమార్ ఆవేశంతో తల్లి పోచమ్మ గొంతు నులిమి హత్య చేశాడు. ఇది చూసిన పెద్ద కుమారుడు పోలీసులకు సమాచారం అందించాడు.మృతురాలి పెద్దకుమారుడు నరసింహులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్ఐ వెల్లడించారు. తూప్రాన్ సిఐ శ్రీధర్, రామయంపేట్ ఎస్సై రాజేష్, పోలీసులు క్లూస్ టీం ఘటనా స్థలాన్ని పరిశీలించి, ఆధారాలు సేకరించారు. ఆ తరువాత మృతదేహానికి పంచనామా నిర్వహించి కేసు నమోదు చేశారు. పోస్టుమార్టం నిమిత్తం రామాయంపేట ప్రభుత్వాసుపత్రికి మృతదేహాన్ని తరలించినట్లు చెప్పారు. 

ఇదిలా ఉండగా, ఇలాంటి దారుణమే క్రిష్ణా జిల్లా మచిలీ పట్నంలో నిరుడు నవంబర్ లో జరిగింది. మచిలీపట్నం పరాస్ పేటలోని శ్రీచైతన్య టెక్నో స్కూల్ సమీపంలో చింతరాజు - వెంకటేశ్వరమ్మ దంపతులు కొడుకు హరీష్ రావుతో కలిసి నివాసముటున్నారు. అయితే హరీష్ తనకు పెళ్లి చేయాలంటూ తల్లిదండ్రులను ఒత్తిడి చేయడంతో వారు సంబంధాలు చూస్తున్నారు. బంధువులతో పాటు తెలిసినవారి ద్వారా చాలా సంబంధాలు వచ్చాయి. కానీ ఏ సంబంధమూ పెళ్లివరకు వెళ్లలేదు. 

కొంతకాలంగా ఇలాగే సంబంధాలు రావడం... పెళ్లి కుదరకపోవడంతో హరీష్ డిప్రెషన్ కు గురయ్యాడు. దీంతో తరచూ తల్లిదండ్రులతో గొడవ పడుతుండేవాడు. ఈ క్రమంలోనే తల్లీ కొడుకుల మధ్య గురువారం మరోసారి పెళ్లి విషయంలో మాటామాటా పెరిగింది. దీంతో కోపోద్రిక్తుడైన హరీష్ క్షణికావేశంలో విచక్షణ కోల్పోయి కన్నతల్లిపైనే క్రికెట్ బ్యాట్ తో దాడిచేసాడు. 

వెంకటేశ్వరమ్మ తలపై కొడుకు బలంగా కొట్టడంతో తీవ్ర రక్తస్రావమై అక్కడికక్కడే కుప్పకూలిపోయింది. దీంతో భయపడిపోయిన హరీష్ తల్లిని అలాగే వదిలేని ఇంటితలుపులు మూసేసి పరారయ్యాడు. ఈ ఘటన తర్వాత చాలాసేపటికి ఇంటికి వచ్చిన చింతరాజు తలుపుతెరిచి చూడగా భార్య రక్తపుమడుగులో పడివుంది. దీంతో అతడు భార్యను చికిత్స నిమిత్తం బందరు ప్రభుత్వాస్పత్రికి తరలించాడు. అయితే అప్పటికే ఆమె మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు.

ఈ దారుణం గురించి సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఆసుపత్రికి వెళ్లి వివరాలు సేకరించారు. చింత రాజు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం తల్లిని చంపిన నిందితుడు పరారీలో వుండగా అతడికోసం పోలీసులు గాలిస్తున్నారు.