హైదరాబాద్‌లోని ఓ మెట్రో స్టేషన్ లిఫ్ట్‌లో ఓ యువకుడు అసభ్యంగా ప్రవర్తించాడు. లిఫ్ట్‌లో యువతి ముందు దుస్తులు విప్పి నీచంగా ప్రవర్తించాడు. ఈ ఘటన అమీర్‌పేట్ మెట్రో స్టేషన్‌లో చోటుచేసుకుంది.
హైదరాబాద్‌లోని ఓ మెట్రో స్టేషన్ లిఫ్ట్‌లో ఓ యువకుడు అసభ్యంగా ప్రవర్తించాడు. లిఫ్ట్‌లో యువతి ముందు దుస్తులు విప్పి నీచంగా ప్రవర్తించాడు. ఈ ఘటన అమీర్‌పేట్ మెట్రో స్టేషన్‌లో చోటుచేసుకుంది. ఈ చర్యకు పాల్పడిన యువకుడిని ఎస్సార్ నగర్ పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. వివరాలు.. ఖైరతాబాదుకు చెందిన ఓ యువతి (18) మంగళవారం అమీర్ పేటలో షాపింగ్ కు వెళ్లింది. షాపింగ్ ముగించుకుని తిరిగి ఖైరతాబాద్ వెళ్లేందుకు అమీర్ పేట్ మెట్రోస్టేషన్ లిప్ట్ ఎక్కింది. ఆ తర్వాత ఒడిశాకు చెందిన రాజు (19) అనే వ్యక్తి వెంటనే లిఫ్ట్‌లోకి ప్రవేశించాడు.
లిఫ్ట్‌లో యువతి ఒక్కరే ఉండటంతో.. రాజు తన దుస్తులు విప్పి అసభ్య చేష్టలతో భయపెట్టాడు. సెల్‌ఫోన్‌లో చూసుకుంటూ అతడిని అతడే అనుచితంగా తాకడం మొదలుపెట్టాడు. ఈ క్రమంలోనే ఆందోళన చెందిన యువతి.. లిఫ్ట్ ఆగగానే.. బయటకు వచ్చి మెట్రో భద్రతా సిబ్బందికి సమాచారం అందించింది. వెంటనే భద్రతా సిబ్బంది అతడిని పట్టుకుని ఎస్సార్ నగర్ పోలీసులకు అప్పగించారు. దీంతో పోలీసులు రాజును అరెస్ట్ చేశారు.
‘‘18 ఏళ్ల యువతి ఫిర్యాదు చేయడానికి ఇష్టపడలేదు. అయితే యువతి, భద్రతా సిబ్బంది వాంగ్మూలాల ఆధారంగా.. మేము నిందితులపై సిటీ పోలీసు చట్టంలోని సెక్షన్ 70-బి కింద కేసు నమోదు చేశాం’’ అని ఎస్ఆర్ నగర్ ఇన్‌స్పెక్టర్ సైదులు తెలిపారు. ఇక, ఉపాధి కోసం ఒడిశా నుంచి హైదరాబాద్‌కు వచ్చినట్టుగా నిందితుడు రాజు పోలీసులకు చెప్పాడు.
