ఎండాకాలం వచ్చిదంటే చాలు.. మద్యపాన ప్రియులు బీరుపై ఎక్కువగా ఆసక్తి చూపిస్తుంటారు. అయితే.. బీరు తాగేముందు కాస్త చూసుకోని తాగండంటున్నారు. ఎందుకంటే.. ఈమధ్య బీరులో తేల్లు ప్రత్యక్షమౌతున్నాయి. మీరు చదివింది నిజమే. వరంగల్ జిల్లాలో ఓ వ్యక్తికి బీరులో తేలు అవశేషాలు కనిపించాయి. పూర్తి వివరాల్లోకి వెళితే...

పరకాల ఆర్టీసీ డిపో సమీపంలోని వెంకటేశ్వర వైన్స్ లో ఆదివారం రాకేష్ అనే యువకుడు బీరు కొనుగోలు చేశాడు. కాగా.. ఆ బీరులో తేలు ఉండటం గమనార్హ. అయితే.. బీరు మొత్తం తాగే వరకు రాకేష్ ఆ విషయాన్ని గమనించలేకపోయాడు.

అనంతరం వెంటనే షాప్ యజమానికి దీనిపై ఫిర్యాదు చేశాడు. దీనికి ఆ యాజమాని నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చాడు. తాము ఏమైనా తయారు చేశామా అని షాపు యాజమాని అనటంతో కొద్ది సేపు మద్యం కొనుగోలు దారులతో గొడవ జరిగింది. తేలు  అవశేషాలు ఉన్న బీరు త్రాగటంతో బాధితుడు ఆందోళనకు గురయ్యాడు.  ఘటనను పరకాల ఎక్సైజ్‌ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో తాము విచారణ జరుపుతామని అధికారులు తెలపడంతో గొడవ సద్దుమణిగింది.