పుట్టినరోజు నాడు ఓ యువకుడు పీకలదాకా తప్ప తాగి.. చివరకు ప్రాణాలు కోల్పోయాడు. ఈ సంఘటన సికింద్రాబాద్ ప్రాంతంలో చోటుచేసుకోగా... ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

రెజిమెంటల్‌ బజార్‌ లోని ఓ ప్రైవెట్‌ హాస్టల్‌ లో ఉంటున్న తమిళనాడు కు చేందిన కేశవ ప్రకాశ్‌..ఓ కాల్‌ సేంటర్‌ లో పని చేస్తు రాత్రి సమయంలో హాస్టల్‌ ఉంటున్నాడు. నిన్న అతని పుట్టిన రోజు కాగా .రాత్రి వరకు మద్యం సేవించి రూంకు చేరాడు..ఉదయం ఎంతటికి తలుపులు తెరవకపోవడంతో..గోపాలపురం పోలీసులకు సమాచారం అందించారు.

అనంతరం హాస్టల్‌ నిర్వహకులు..తలుపులు పగలగోట్టి చుసే సారికి అతని బెడ్‌ లోనే ప్రాణం కోల్పోయి ఉన్నాడు..దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. మద్యం అధిక మోతదులోనే త్రాగడం వలన చనిపోయి ఉంటాడని పోలీసులు ప్రాధమికంగా గుర్తించారు.  అధికంగా మద్యం సేవించడం వల్లే కేశవ్‌ మృతి చెందినట్లు భావిస్తున్నప్పటికీ, ఇతర కారణాలు ఏవైనా ఉంటాయన్న కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు.