Asianet News TeluguAsianet News Telugu

గ్రూప్ 5 ఉద్యోగాలు సృష్టించిన తెలంగాణ నిరుద్యోగులు

  • కోల్డ్ స్టోరేజీకి చేరుతున్న ఉద్యోగ నోటిఫికేషన్లు  
  • సర్కారు తీరుపై యువతో అసంతృప్తి
  • గొర్రెల పథకానికి గ్రూప్ 5 జాబ్ అని పేరు పెట్టిన యూత్
  • సర్కారుపై సెటైర్లు వేస్తున్న నిరుద్యోగులు
youth creates group 5 jobs for Telangana unemployed

ఆగండి ఆగండి... తొందర పడకండి. ఉద్యోగాల  జాతర అనగానే ఉరుకులు పరుగులు పెట్టకండి. కొంచెం ఓపికగా ఈ పోస్టు చదవండి. ఇది మామూలు ఉద్యోగాల జాతర కాదు. చేతినిండా పనిదొరికే ఉద్యోగాలు. క్వాలిఫికేషన్లతో పనిలేని ఉద్యోగాలు... పోటీ పరీక్షలతో అవసరం లేని ఉద్యోగాలు. వీటికి ఇలా అప్లై చేస్తే అలా ఉద్యోగం వచ్చినట్లే నట. మరి ఆ ఉద్యోొగాలేంటో మీరే చదవండి.

తెలంగాణ సర్కారు ఏ నోటిఫికేషన్ జారీ చేసినా అది పరిపూర్ణమైన పరిస్థితి లేదు. ఉద్దేశపూర్వకంగానా? లేక యాదృచ్చికమో తెలియదు కానీ ప్రతి నోటిఫికేసన్ వివాదాల్లో చిక్కుకుని కోల్డ్ స్టోరేజీ లోకి నెట్టబడుతోంది. తెలంగాణ ఏర్పాటైన తర్వాత ఒక్క టీచర్ పోస్టును భర్తీ చేయలేదు. ఇక ఎస్సై పోస్టులకు పరీక్షలు జరిగినా ఫలితాలు తేలలేదు. కానిస్టేబుల్ పోస్టుల భర్తీ రచ్చ అయింది.  అభ్యర్థులు సచివాలయం ముందు ధర్నాలు చేశారు. గ్రూప్ 2 అయోమయంలో పడిపోయింది. ఉమ్మడి రాష్ట్రంలో సింపుల్ గా డిఎస్సీ ద్వారా టీచర్ పోస్టులు భర్తీ చేస్తే నేడు కెసిఆర్ సర్కారు పట్టుమని 7వేల ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయలేక ఆపసోపాలు పడుతున్నది

ఇవన్నిటికంటే గ్రూప్ 5 జాబ్ ఈజీగా వస్తదని చెబుతున్నాడు ఈ యాదవ యువకుడు. గ్రూప్ 5 ఉద్యోగాలా? అదేంటని అడిగితే తెలంగాణ సర్కారు ప్రవేశపెట్టిన గొర్రెల పంపిణీ పథకం అంటున్నాడు. గొర్రెల పంపిణీ పథకం కింద ఉద్యోగం పొందడం చాలా  ఈజీ అని చెబుతున్నాడు. పెద్దగా చదువులు అవసరం లేదు, కోచింగ్ ఫీజులు అవసరం లేదు, హాస్టల్ ఛార్జీలు అసలే లేవు. సులువుగా ఈ పోస్టుకు దరఖాస్తు చేశాను. సెలెక్ట్ అయ్యాను అంటూ సోషల్ మీడియాలో ఒక యాదవ యువకుడు పెట్టిన ఈ పోస్టు వైరల్ అయిపోయింది.

మొత్తానికి తెలంగాణలో ఉద్యోగాలిచ్చే విషయంలో సర్కారు పై నిరుద్యోగుల్లో నిరాశ నిస్ప్రృహ పెరిగిపోతున్నాయి. దీంతో నిరుద్యోగులు తమ నిరసన  ను సర్కారుకు తెలియజెప్పేందుకు ఇలా ప్రత్యామ్నాయ పద్ధతులను వినియోగించుకుంటున్నారు. గతంలో కొందరు యువకులు ఉద్యోగాల కోసం కెసిఆర్ కు పాలాభిషేకం చేసి నిరసన తెలిపారు. మొత్తానికి ఉద్యోగాలివ్వకుండా కేవలం మాటలకే పరిమితమైన వాతావరణం తెలంగాణలో ఉన్నట్లు వీరి నిరసనల ద్వారా తేలిపోతున్నది.

Follow Us:
Download App:
  • android
  • ios