Asianet News TeluguAsianet News Telugu

ప్రియురాలి మోసం... అచ్చంగా ‘ఆర్ఎక్స్100’ కథే

ఇటీవల విడుదలైన ఆర్ఎక్స్ 100 సినిమాలో హీరోయిన్ హీరోని మోసం చేసినట్లుగానే.. ఓ యువతి ప్రేమ పేరిట యువకుడిని మోసం చేసింది. అది తట్టుకోలేని యువకుడు నాలుగు పేజీల సూసైడ్ లేఖ రాసి ఆత్మహత్య చేసుకున్నాడు.

youth commits suicide in ameerpet over love failure
Author
Hyderabad, First Published Jun 5, 2019, 3:33 PM IST

ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించిన అమ్మాయి మోసం చేసింది. తననే పెళ్లాడతానని చెప్పి.. నాలుగేళ్ల పాటు తనతో చెట్టాపట్టాలేసుకొని తిరిగి... చివరకు మరో వ్యక్తితో మూడు ముళ్లు వేయించుకుంది. ఆ బాధను తట్టుకోలేక ఆ భగ్న ప్రేమికుడు  ప్రాణాలు తీసుకున్నాడు. సినిమా కథను తలపిస్తున్న ఈ ఘటన నిజ జీవితంలో చోటుచేసుకుంది. ఇటీవల విడుదలైన ఆర్ఎక్స్ 100 సినిమాలో హీరోయిన్ హీరోని మోసం చేసినట్లుగానే.. ఓ యువతి ప్రేమ పేరిట యువకుడిని మోసం చేసింది. అది తట్టుకోలేని యువకుడు నాలుగు పేజీల సూసైడ్ లేఖ రాసి ఆత్మహత్య చేసుకున్నాడు.

పూర్తి వివరాల్లో వెళితే.... ఆ యువకుడి పేరు మాచీడు అఖిల్ రెడ్డి. 2015 నుంచి ఓ అమ్మాయిని ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించాడు. వీరి ప్రేమ విషయం యువతి తల్లికి కూడా తెలుసు. 2019 వరకు వీరి ప్రేమ బాగానే సాగింది. మధ్యలో యువతి తండ్రి చనిపోయినప్పుడు వాళ్ల కుటుంబానికి అండగా నిలిచాడు. వారికి ఆర్థికంగా ఎలాంటి అవసరం వచ్చినా ఆదుకున్నాడు. నాలుగేళ్ల ప్రేమ ప్రయాణం చేసిన తర్వాత పెళ్లి చేసుకుందామని అఖిల్ ఆ యువతిని కోరాడు.

అందుకు ఆ యువతి వెంటనే అంగీకరించకుండా ఏవేవో సాకులు చెప్పడం మొదలుపెట్టింది. ఏదో ఒక విధంగా గొడవలు పడటం మొదలుపెట్టింది. తర్వాత చిన్నగా మరో అబ్బాయితో పరిచయం పెంచుకొని అతనితో మాట్లాడటం మొదలుపెట్టి అఖిల్ ని పూర్తిగా దూరం పెట్టింది. విషయం ఆలస్యంగా గ్రహించిన అఖిల్ తన ప్రేయసిని, ఆమె తల్లిని నిలదీశాడు. దానికి వాళ్లు నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడంతో బాధపడ్డాడు. 

తర్వాత తన తల్లిదండ్రులు, సోదరితో కలిసి వచ్చి తన ప్రేయసి తల్లితో మాట్లాడాడు. వాళ్లు బ్రతిమిలాడినా కూడా యువతి అఖిల్ ని పెళ్లి చేసుకోనని తేల్చి చెప్పింది. చేసేదేమీలేక ఈ విషయాన్ని యువతి బంధువులకు చెప్పారు. వాళ్లు యువతిని, ఆమె తల్లిని మందలించారు.దీంతో.. మారిపోయినట్లు నటించిన యువతి... అఖిల్ ని పెళ్లి చేసుకుంటానని చెప్పింది.

తన ప్రేయసి తన ప్రేమను అంగీకరించిందని త్వరలో పెళ్లి చేసుకుంటామని అతను ఆనందపడేలోపే... ఆర్య సమాజ్ లో మరో యువకుడిని పెళ్లి చేసుకుంది. విషయం తెలుసుకుని అఖిల్ చాలా బాధపడ్డాడు. తన ప్రేయసిని ఆమె తల్లిని చంపేయాలని అనుకున్నాడు. అలా చేస్తే.. తనను దోషి ని చేస్తారు తప్ప...తన బాధను ఎవరూ అర్థం చేసుకోరని ఊరుకున్నాడు. తన ప్రేయసికి శిక్ష విధించాలని కోరుతూ నాలుగు పేజీల లేఖ రాసి ఆత్మహత్య చేసుకున్నాడు. 

Follow Us:
Download App:
  • android
  • ios