ఓ యువతిని ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించాడు. ఆమె లేకుంటే తన జీవితమే లేదు అనుకున్నాడు. అలాంటి అమ్మాయిని జీవితంలో కలవొద్దు అని చెప్పడంతో తట్టుకోలేక పోయాడు. తన ప్రాణాలనే వదిలేశాడు. ఈ సంఘటన కీసర మండలం అంకిరెడ్డిపల్లిలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే...  కీసర మండలం అంకిరెడ్డిపల్లికి చెందిన మహేష్(22) చర్లపల్లిలోని ఓ కంపెనీలో పనిచేసేవాడు. అక్కడ ఓ యువతిని చూసి ప్రేమించడాడు. చాలాసార్లు ఆ యువతితో మాట కలిపాడు. ఈ విషయం యువతి కుటుంబీకులు చూడటంతో.... మహేష్ ని మందలించారు. ఆ అమ్మాయి కూడా మహేష్ ని ఇష్టపడినా.. ఆమె కుటుంబీకులు మాత్రం అంగీకరించలేదు.

Also Read గర్ల్ ఫ్రెండ్ తో లాడ్జికి వెళ్లి... శవంగా మారిన డీజే

ఈ క్రమంలో కుటుంబసభ్యులకు తెలియకుండా యువతి మహేష్ ని కలవడానికి వచ్చింది. ఈ విషయం ఆమె తల్లిదండ్రులకు తెలియడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో.. పోలీసులు మహేష్ ని అరెస్టు చేశారు. అతని గ్రామస్థులు స్టేషన్ కి వచ్చి అతనిని విడిపించి ఇంటికి తీసుకువెళ్లారు.

ఇంకెప్పుడూ ఆ యువతిని కలవొద్దని అందరూ మందలించారు. తాను ప్రేమించిన అమ్మాయి ఇక తనకు దూరమయ్యిందనే బాధతో మహేష్... ఇంటి పక్కన ఉన్న చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.