గర్ల్ ఫ్రెండ్ తో కలిసి లాడ్జ్ కి వెళ్లిన ఓ యువకుడు అదే లాడ్జ్ లో శవంగా మారాడు. ఈ సంఘటన నగరంలోని  గచ్చిబౌలిలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే... సనత్ నగర్ లోని శివాజీ నగర్ కి చెందిన రత్నవర ప్రసాద్(22)  డీజేగా పనిచేస్తున్నాడు. గురువారం రాత్రి 11గంటల సమయంలో ఇంట్లో నుంచి బయటకు వెళ్లాడు. ఆ తర్వాత అతని తల్లి ఫోన్ చేయగా...ఫ్రెండ్ ఇంటికి వచ్చానని.. శుక్రవారం ఉదయం ఇంటికి వచ్చేస్తానని చెప్పాడు. 

అయితే.. రాత్రి ఒంటి గంట సమయంలో వరప్రసాద్ తన గర్ల్ ఫ్రెండ్.. తన ఫ్రెండ్ రానా, అతని గర్ల్ ఫ్రెండ్ తో కలిసి గచ్చిబౌలిలోని ఓ లాడ్జ్ కి వెళ్లాడు. కాగా... లాడ్జికి వెళ్లిన తర్వాత వరప్రసాద్ కి తన గర్ల్ ఫ్రెండ్ తో చిన్నపాటి గొడవ అయ్యింది. కోపంతో తన గర్ల్ ఫ్రెండ్ పై చెయ్యి కూడా చేసుకున్నాడు. ఆతర్వాత ఆ యువతి నిద్రపోగా... వరప్రసాద్ మాత్రం నిద్రపోకుండా అలానే మెలకువగా ఉన్నాడు.

Also Read జూబ్లీహిల్స్ అఫైర్ పబ్ లో అశ్లీల నృత్యాలు: కంపెనీ డైరెక్టర్ అరెస్టు...

శుక్రవారం ఉదయం 9గంటలకు సదరు యువతి రూమ్ నుంచి వెళ్లి పోయింది. ఆ తర్వాత వర ప్రసాద్ గదిలోకి అతని ఫ్రెండ్ రాానా వచ్చాడు. కింద పడి ఉండటం చూసి.. తాగేసి పడుకున్నాడేమో అనుకున్నాడు. తర్వాత ఏడిపించొచ్చని ఫోటో కూడా తీశాడు. ఆ తర్వాత కిందపడుకున్న వరప్రసాద్ ని తీసి.. బెడ్ మీద పడుకోపెట్టాడు. ముఖంపై నీళ్లు కూడా చల్లాడు. అయినా లేకపోతే.. తర్వాత వాడే లేస్తాడులే అనుకొని తన గర్ల్ ఫ్రెండ్ తో కలిసి   రూమ్ వెకేట్ చేసి వెళ్లిపోయారు.

వరప్రసాద్ నిద్రపోతున్నాడని అందరూ అనుకున్నారు. కానీ అతను అప్పటికే చనిపోవడం గమనార్హం.  మధ్యాహ్నం 1గంట దాటినా బయటకు రాకపోవడంతో అనుమానం కలిగింది.  రూమ్ సర్విసింగ్ కి వచ్చిన వాళ్లు.. వరప్రసాద్ అపస్మారక స్థితిలో పడి ఉండటాన్ని చూసి పోలీసులకు సమాచారం అందించారు.

అతను ఎలా చనిపోయాడు అనే విషయం మిస్టరీగా ఉంది. కనీసం ఒంటిపై ఎలాంటి గాయాలు కూడా కనిపించలేదని పోలీసులు చెబుతున్నారు. అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు చెప్పారు.