సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలంలో ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు.  గుర్తు తెలియని వ్యక్తులు అతనిని  చంపేసినట్లు తెలుస్తోంది. చంపిన తర్వాత తల, మొండెం వేరు చేయడం గమనార్హం. మొండెం నుంచి తలను వేరుచేసి వాగులో పడేశారు.  బసంతపూర్ గ్రామశివారులోని వాగులో గుర్తుతెలియని వ్యక్తి మొండేన్ని గుర్తించిన గ్రామస్తులు  హద్నూర్ పోలీసులకు సమాచారం అందించారు.

 ఏఎస్ఐ జగదీశ్వర్ సిబ్బందితో కలిసి ఘటనాస్థలానికి చేరుకొని మొండాన్ని స్వాధీనం చేసుకొని తలకోసం వాగు పరిసరాల్లో గాలిస్తున్నారు. హత్యకు గురైన వ్యక్తి వయసు 35 -40 ఉంటుందని పోలీసులు తెలిపారు. ఎక్కడో హత్య చేసి మృతదేహాన్ని ఇక్కడికి తీసుకువచ్చి వాగులో పడేసి ఉంటారని భావిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.   ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.