మత్తు పదార్థాలకు అలవాటు పడిన ఓ యువకుడు కరీంనగర్ లో అర్థ నగ్నంగా వీరంగం సృష్టించాడు. లాక్ డౌన్ విరామ సమయంలో కరీంనగర్ పట్టణంలోని గీతా భవన్ నుంచి బస్టాండ్ కు వెళ్లే దారిలో వచ్చిపోయే వాహనాలను ఆపేసి వాటిమీదికి ఎక్కి హల్ చల్ చేశాడు. 

మత్తు పదార్థాలు విచక్షణను చంపేస్తాయి. ఏం చేస్తున్నారో, ఏం చేయట్లేదో తెలియదు. మనసు గాడితప్పి విచిత్రంగా ప్రవర్తిస్తారు. ఇది కొన్నిసార్లు చాలా ఇబ్బందులకు దారి తీస్తుంది. అలాంటి ఘటనే ఒకటి కరీంనగర్ లో జరిగింది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred

మత్తు పదార్థాలకు అలవాటు పడిన ఓ యువకుడు కరీంనగర్ లో అర్థ నగ్నంగా వీరంగం సృష్టించాడు. లాక్ డౌన్ విరామ సమయంలో కరీంనగర్ పట్టణంలోని గీతా భవన్ నుంచి బస్టాండ్ కు వెళ్లే దారిలో వచ్చిపోయే వాహనాలను ఆపేసి వాటిమీదికి ఎక్కి హల్ చల్ చేశాడు. 

యువకుడి చేష్టలకు రోడ్డు మీద వెడుతున్న వారు వింతగా చూశారు. ఆ యువకుడి నుంచి తప్పించుకునేందుకు ఓ కారు యజమాని విశ్వ ప్రయత్నం చేశారు. చివరికి స్థానికులు ఆ యువకుడిని పట్టుకుని చెట్టుకు కట్టేశారు. సదరు యువకుడు వరంగల్ జిల్లాకు చెందిన రమేష్ గా గుర్తించారు.