నిర్మల్: ఓ ఛాలెంజ్ యువకుడి ప్రాణాలు తీసింది. ఈ ఘటన నిర్మల్ జిల్లాలో చోటు చేసుకొంది. నిర్మల్ జిల్లాలోని లక్ష్మణ చాంద మండలం చింతలచాందకు చెందిన షేక్ ఖాజా రసూల్ భవన నిర్మాణ కార్మికుడిగా పని చేస్తున్నాడు.

మామడ మండలం అనంతపేటలో ఖాజా రసూల్ మరో నలుగురు మేస్త్రీలతో కలిసి సోమవారం నాడు విందు చేసుకొన్నారు. ఓ పుల్ బాటిల్ ను ఈ ఐదుగురు కలిసి తాగారు. అయితే ఈ సమయంలో మిత్రుల మధ్య ఓ ఛాలెంజ్ చోటు చేసుకొంది.దమ్ముంటే ఇరవై నిమిషాల్లో పుల్ బాటిల్ ఖాళీ చేస్తే... రూ. 20 వేలు బహుమతిగా ఇస్తామని మిత్రులు రసూల్ కు చెప్పారు.

also read:రెండు నెలల్లో రూ. 5 వేల కోట్లు: లిక్కర్ సేల్స్‌తో తెలంగాణ ఖజనాకు డబ్బు

ఈ పందెనికి రసూలు ఒప్పుకొన్నాడు.  మిత్రులు  నాలుగు క్వార్టర్ సీసాలు తెప్పించారు. రెండు క్వార్టర్ సీసాలను రసూలు అవలీలగా తాగాడు.  మూడో సీసా తాగే సమయంలో ఆకస్మాత్తుగా కుప్పకూలిపోయాడు. 

వెంటనే అతని మిత్రులు అంబులెన్స్ లో అతడిని నిర్మల్ ప్రభుత్వాసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే మరణించాడు. మరణించిన రసూల్ స్వగ్రామం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రకాశం జిల్లా. రసూలు మరణానికి కారణమైన  రత్తయ్య, నాగూరుబాషాలపై కేసు నమోదు చేసినట్టుగా సోన్ సీఐ జీవన్ రెడ్డి తెలిపారు.