ఇంట్లో జరిగిన గొడవ.. ఇద్దరు అన్నదమ్ముల మధ్య కత్తిపోట్లకు కారణమైంది. ఈ సంఘటన చాదర్ ఘాట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అయోధ్య నగర్ లో జరిగింది.

 పూర్తి వివరాల్లోకి వెళితే.. ఆదాయపన్నుశాఖలో పనిచేసే  జ్ఞానేశ్వర్ కి వంశీ, శ్రీనాథ్ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. కాగా.. సోమవారం అన్నదమ్ముల మధ్య చిన్నపాటి గొడవ జరిగింది. ఆ గొడవలో శ్రీనాథ్ కోపంతో ఊగిపోయాడు. 

ఈ క్రమంలోనే   తన వంశీ(22)ని కత్తితో పొడిచాడు. తీవ్ర గాయాలై తన అన్న వంశీ రక్తపు మడుగులో పడిపోవడంతో.. భయంతో శ్రీనాథ్ అక్కడి నుంచి పరారయ్యాడు. ప్రస్తుతం వంశీ.. యశోధ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నాడు.  కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు నిందితుడిపై ఐపీసీ 307 సెక్షన్లు పెట్టి.. కేసు దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.