Asianet News TeluguAsianet News Telugu

మరో వ్యక్తితో చనువుగా ఉంటోందని స్నేహితురాలని చంపిన యువతి.. సల్లూరి అంజలి హత్య కేసును చేధించిన పోలీసులు..

ఈ నెల 15వ తేదీన మంచిర్యాల జిల్లాలో జరిగిన సల్లూరి అంజలి హత్య కేసును పోలీసులు చేధించారు. మరో యువకుడితో చనువుగా ఉంటుందనే కారణంతో దూరపు బంధువు, స్నేహితురాలు అయిన యువతే ఈ దారుణానికి పాల్పిందని చెప్పారు. 

Young woman who killed her friend..  Police crack the murder case of Salluri Anjali.. ISR
Author
First Published Mar 23, 2023, 10:09 AM IST

మరో వ్యక్తితో చనువుగా ఉంటోందనే కారణంతో ఓ యువతి తన స్నేహితురాలిని హత్య చేసింది. ఈ ఘటన మంచిర్యాల జిల్లాలో చోటు చేసుకుంది. ఈ నెల 15వ తేదీన జిల్లాలో సంచలనం రేకెత్తించిన సాలూరి అంజలి (21) హత్య కేసును తాజాగా పోలీసులు చేధించారు. దీనికి సంబంధించిన వివరాలను మందమర్రి ఎస్ హెచ్ వో మహేందర్ రెడ్డి బుధవారం మీడియా సమావేశంలో వెల్లడించారు. 

మంటల్లో చిక్కుకున్న బిఎస్ఎన్ఎల్ కార్యాలయం.. భయాందోళనల్లో స్థానికులు

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మామిడిగట్టుకు చెందిన 21 ఏళ్ల సల్లూరి అంజలి, నెన్నెల మండలం మన్నెగూడకి చెందిన 22 ఏళ్ల పి. మల్లీశ్వరీలు దూరపు బంధువులు. మళ్లీశ్వరీ మంచిర్యాలలోని ప్రైవేటు ఆసుపత్రిలో క్లీనర్ గా పనిచేస్తుండగా.. అంజలి ఓ ఆప్టికల్ షాప్ లో పని చేస్తోంది. వీరి మరి కొంత మందితో కలిసి మంచిర్యాలలో గది అద్దెకు తీసుకొని నివసిస్తున్నారు. దూరపు బంధువులు కావడం, ఒకే గదిలో ఉండటం, వయస్సులో కూడా పెద్దగా తేడా లేకపోవడంతో వీరిద్దరూ స్నేహితులు అయ్యారు. 

అయితే అంజలి పట్ల మల్లీశ్వరీ ఆకర్శితురాలైంది. చాలా కాలం క్రితమే ఆమె ఈ విషయాన్ని అంజలికి చెప్పింది. పెళ్లి చేసుకుందామని ప్రతిపాదించింది. కానీ దీనిని అంజలి తిరస్కరించింది. తనకు అలాంటి ఆలోచన లేదని తెలిపింది. ఈ క్రమంలో గత కొన్ని నెలల నుంచి అంజలి శ్రీనివాస్ అనే యువకుడితో చనువుగా ఉంటోంది. ఈ విషయం మల్లీశ్వరికి తెలిసింది. శ్రీనివాస్, అంజలిని చూసి అసూయ పెంచుకుంది. ఈ విషయంలో స్నేహితురాలితో ఆమె గొడవ కూడా పడింది. అతడితో చనువుగా ఉండొద్దని సూచించింది. కానీ ఆమె మాటను అంజలి పట్టించుకోలేదు. 

దారుణం.. భార్యను హత్య చేసి, మృతదేహాన్ని మూడు ముక్కలుగా నరికి గార్డెన్ లో పూడ్చిపెట్టిన భర్త.. కోల్ కతాలో ఘటన

కాగా.. ఈ నెల 15వ తేదీన అంజలిని మల్లీశ్వరీ బయటకు తీసుకెళ్లింది. మాట్లాడుకుందామంటూ ఆర్కే 5 నుంచి గుడిపల్లికి వెళ్లే దారిలో ఉన్న అటవీ ప్రాంతానికి తీసుకెళ్లింది. అక్కడ ఆమెపై కత్తితో దాడి చేసి హత్య చేసింది. దీని నుంచి తప్పించుకునేందుకు ఆమె కూడా గాయాలు చేసుకుంది. ఈ క్రమంలో రూమ్ మేట్స్, శ్రీనివాస్ అంజలి కోసం గాలించగా ఆమె మృతదేహం చివరకు అడవిలో లభ్యమైంది. గాయాలతో ఉన్న మల్లీశ్వరిని, అంజలిని హాస్పిటల్ కు తీసుకెళ్లారు. కానీ అప్పటికే బాధితురాలు చనిపోయింది.

బిల్కిస్ బానో అత్యాచార దోషులకు సుప్రీం షాక్.. ప్రత్యేక బెంచ్‌ ఏర్పాటుకు అంగీకారం.. 

ఈ హత్య కేసులో విచారణ చేపట్టిన పోలీసులు మల్లీశ్వరిని అరెస్టు చేశారు. ఆమె మొదట్లో తాను, అంజలి ఒకరినొకరు చంపుకోవడానికి ప్రయత్నించామని, ఇది ఆత్మరక్షణ కేసు అని చెప్పి దర్యాప్తుదారులను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేసింది. చివరకు సోమవారం ఆమె నేరాన్ని అంగీకరించింది. విచారణ అనంతరం హత్యను పునఃసృష్టించడానికి మంగళవారం మల్లేశ్వరిని సంఘటనా స్థలానికి తీసుకెళ్లి స్థానిక కోర్టులో హాజరుపరిచినట్లు అధికారులు తెలిపారు. ఆమెను జ్యుడీషియల్ రిమాండ్ కు తరలించారు.

Follow Us:
Download App:
  • android
  • ios