కరీంనగర్ జిల్లా కేంద్రంలోని   టవర్ సమీపంలోని బిఎస్ఎన్ఎల్ కార్యాలయంలో షార్ట్ సర్క్యూట్ తో అగ్ని ప్రమాదం సంభవించింది.  ఉదృతంగా మంటలెగిసిపడుతున్నాయి. మంటలను గమనించిన స్థానికులు ఫైర్ సర్వీస్  సిబ్బందికి సమాచారం అందించారు. రంగంలోకి దిగిన అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు.

కరీంనగర్ జిల్లా కేంద్రంలోని టవర్ సర్కిల్ సమీపంలోని బిఎస్ఎన్ఎల్ కార్యాలయంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. షార్ట్ సర్క్యూట్ తో అగ్ని ప్రమాదం సంభవించింది. క్రమంగా మంటలు ఉదృతంగా ఎగిసిపడుతున్నాయి. అగ్ని ప్రమాదాన్ని గమనించిన స్థానికులు, సమీప వర్తకలు ఫైర్ సర్వీస్ సిబ్బందికి సమాచారం అందించారు. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగింది.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. అయితే మంటలు ఇంకా అదుపులోకి రాలేదు. మంటలెగిసి పడుతుండటంతో పక్కనున్న వాణిజ్య సముదాయ యాజమానులు, స్థానికులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. అసలు అగ్ని ప్రమాదం షార్ట్ సర్క్యూట్ వల్లే జరిగిందా? మరి ఏమైనా కారణమా అనేది తేలాల్సి ఉంది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని విచారణ చేస్తున్నారు. మరిన్ని విషయాలు తెలియాల్సి ఉంది.