దారుణం: గొంతుకోసి యువతి హత్య, ఆత్మహత్యాయత్నం చేసిన లవర్

Young man suicide attempt after killed his lover in Karimnagar district
Highlights

ప్రేమోన్మాది ఘాతుకం

కరీంనగర్: కరీంనగర్ జిల్లా కేంద్రంలోని  మీసేవా సెంటర్‌లో పనిచేస్తున్న ఓ యువతిని ప్రేమోన్మాది గొంతు కోసి శుక్రవారం నాడు చంపేశాడు. ఆ తర్వాత తాను కూడ ఆత్మహత్యయత్నానికి ప్రయత్నించాడు.  ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.  నిందితుడిని  స్థానికులు పోలీసులకు అప్పగించారు.నిందితుడిని ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. 

కరీంనగర్ జిల్లాకు  చెందిన ఓ యువతిని  ఓ యువకుడు ప్రేమ పేరుతో వేధింపులకు గురిచేస్తున్నాడు. శుక్రవారం నాడు మీ సేవా  సెంటర్ వద్ద  యువతి గొంతు కోసి చంపేశాడు. అంతేకాదు ఆ తర్వాత తాను కూడ ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు. స్థానికులు అతడిని చితకబాది పోలీసులకు అప్పగించారు.  నిందితుడిని పోలీసులు  ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.


కరీంనగర్ జిల్లా కాటారం మండలం శంకరంపల్లి గ్రామానికి చెందిన వంశీధర్, గోదవరిఖనికి చెందిన రసజ్ఞ మధ్య గత మూడు సంవత్సరాలు ప్రేమ వ్యవహారం ఉందని తెలుస్తోంది. నిత్యం వంశీధర్ వేధింపులకు గురిచేయడంతో కొద్దిరోజులు రసజ్ఞ అతడికి దూరంగా ఉంటూ వస్తోంది.  మూడు నెలల క్రితమే జిల్లా కలెక్టరేట్ ఎదుట ఉన్న మీసేవా కేంద్రంలో రసజ్ఞ ఉద్యోగంలో చేరింది. 


కరీంనగర్‌లోని మీ సేవా సెంటర్‌లో రసజ్ఞ  విధుల్లో చేరిన విషయం తెలుసుకొన్న  వంశీధర్ శుక్రవారం నాడు ఆమెతో వాగ్వాదానికి దిగి గొంతుకోసి హత్య చేశాడు. 
 వెంటనే అప్రమత్తమైన మీసేవా నిర్వాహకులు నిందితుడుని పట్టుకుని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. 

 

loader