ఆన్ లైన్ షాపింగ్ లో మోసాలు ఇప్పుడు కొత్తేం కాదు. ఒక వస్తువుకు మరో వస్తువు పంపించడం.. అసలు వస్తువు బదులు నకిలీ వస్తువులు అందుతుండడం మామూలే. అయితే ఇటీవల వీటిల్లో చాలా మార్పు వచ్చింది. కొత్తల్లో జరిగినన్ని తప్పులు జరగడం లేదు.

అయితే మహబూబాబాద్ లో జరిగిన ఘటన మాత్రం వింతగా ఉంది. వివరాల్లో వెడితే.. మహబూబాబాద్ కు చెందిన సాయి అనే యువకుడు అమెజాన్ ఆన్‎లైన్ షాపింగ్‎లో ర్యాక్స్ బుక్ చేశారు.

తీరా పార్శిల్ వచ్చాక విప్పి చూసి షాక్ తిన్నాడు. అతనికి ర్యాక్స్ బదులు కండోమ్స్ ప్యాకేట్స్ డెలవరీ వచ్చాయి. దీంతో  సాయి గందరగోళానికి గురయ్యాడు. మరోసారి ఆన్ లైన్ షాపింగ్ చేయనని యువకుడు లబోదిబోమన్నాడు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా కేసముద్రంలో జరిగింది.