తాగిన మత్తులో చెల్లెలితో గొడవపడి అమ్మమ్మను హత్య చేసిన దారుణ ఘటన వికారాబాద్ లో చోటుచేసుకుంది. వికరాబాద్ మున్సిపాలీటీ పరిథిలోని కొత్తగడిలో బుధవారం జరిగిన ఈ హత్య కలకలం రేపింది.  

తాగిన మత్తులో చెల్లెలితో గొడవపడి అమ్మమ్మను హత్య చేసిన దారుణ ఘటన వికారాబాద్ లో చోటుచేసుకుంది. వికరాబాద్ మున్సిపాలీటీ పరిథిలోని కొత్తగడిలో బుధవారం జరిగిన ఈ హత్య కలకలం రేపింది. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

కొత్తగడికి చెందిన నర్సింగ్ రావు(22) ఏ పనీ చేయకుండా ఆవారాగా తిరిగేవాడు. దీంతోపాటు తాగుడుకు అలవాటు పడ్డాడు. రోజూ తాగి వచ్చి ఏదో గొడవ చేసేవాడు. అలా బుధవారం కూడా తాగివచ్చి చెల్లెల్లి దగ్గరున్న ఫోన్ ఇవ్వమని అడిగాడు. చెల్లెలు ఇవ్వనంది. దీంతో పట్టరాని కోపంతో నర్సింగరావు చెల్లెలి మీద దాడి చేశాడు.

విపరీతంగా కొడుతుండడంతో అది చూసిన వరుసకు అమ్మమ్మ అయ్యే అత్వెల్లి బాలమ్మ (80) అడ్డు వచ్చింది. అయితే తాగిన మైకంలో ఉన్న నర్సింగరావు కోపంతో బాలమ్మను నెట్టేసి, పక్కనే ఉన్న బండరాయితో బాలమ్మ తలపై కొట్టాడు. దీంతో తీవ్రంగా గాయపడింది. వెంటనే స్థానికులు ఆమెను ప్రభుత్వాసుపత్రికి తరలించగా.. తీవ్ర రక్తస్రావం, బలమైన గాయం కారణంగా బాలమ్మ మృతి చెందింది.

విషయం తెలిసిన పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని నర్సింగరావును అదుపులోకి తీసుకున్నారు. నర్సింగరావుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ రాజశేఖర్ తెలిపారు.