కోడిగుడ్డు కూర ఒకరి ప్రాణాలు తీసింది. ఎగ్ కర్రీ వండమంటే గుడ్లు లేవన్నారని మనస్తాపంతో ఓ యువకుడు నిండు ప్రాణాలు తీసుకున్నాడు. ఈ ఘటన మెదక్ జిల్లాలో కలకలం రేపింది.
మనోహరాబాద్ : రాత్రి భోజనంలోకి egg curry చేయలేదని కోపగించుకున్న యువకుడు తల్లిపై కోపంతో ఉరివేసుకుని suicide చేసుకున్నాడు. ఈ ఘటన మండలంలోని రంగాయపల్లిలో మంగళవారం అర్థరాత్రి చోటు చేసుకుంది. మనోహరాబాద్ ఎస్ఐ రాజుగౌడ్ తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన మస్కూరి నర్సింలు, సుశీల దంపతులకు ఇద్దరు కొడుకులు. అందులో చిన్న కొడుకు మములేశ్ (19) ఇీవల రోడ్డు ప్రమాదం బారిన పడగా భుజానికి గాయమయ్యింది. దీంతో కొన్ని రోజులుగా ఏ పనీ చేయకుండా ఇంట్లోనే ఉంటున్నాడు.
ఈ నేపథ్యంలో మంగళవారం రాత్రి మములేశ్ తల్లి సుశీలను కోడిగుడ్డు కూర వండాలని కోరాడు. ఇంట్లో eggs లేవని ఇప్పుడు వండలేనని ఆమె చెప్పడంతో తల్లితో వాగ్వాదానికి దిగి ఇంట్లో నుంచి వెళ్లిపోయాడు. ఎంతకూ ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు గ్రామంలో అన్ని చోట్లా వెదికినా ఆచూకీ లభ్యం కాలేదు. బుధవారం ఉదయం ఉదయం గ్రామ సమీపంలోని మహంకాళి దేవాలయం దగ్గర పొలంలో చెట్టుకు current wireతో ఉరి వేసుకుని, బలవన్మరణానికి పాల్పడినట్లు గుర్తించారు. ఈ మేరకు తండ్రి నర్సింలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని మృతదేహఆన్ని పోస్టుమార్టం నిమిత్తం తూఫ్రాన్ ప్రభుత్వాసుపత్రికి తరలించినట్లు ఎస్ఐ తెలిపారు.
ఇదిలా ఉండగా, chicken curry వండలేదని సోదరుడే చెల్లిని చంపిన సంఘటన East Godavari District కూనవరం మండలం కన్నాపురంలో మార్చి 5న చోటుచేసుకుంది. సీఐ గజేంద్ర కుమార్ శుక్రవారం తెలిపిన వివరాల ప్రకారం… కన్నాపురానికి చెందిన కొవ్వాసి నంద కూలీ చేసుకుంటూ జీవిస్తున్నాడు. ఆయనను చూసేందుకు telanganaలోని కరకగూడెం మండలం మాదన్నగూడెంలో నివసిస్తున్న చెల్లెలు సోమమ్మ(20) వారం కిందటే కన్నాపురం వచ్చింది. రెండు రోజుల్లో వస్తాను అని నంద భార్య పుట్టింటికి వెళ్ళింది. నంద గురువారం రాత్రి పదింటికి liquor మత్తులో కోడి మాంసం ఇంటికి తీసుకొచ్చాడు.
కోడి కూర వండు అన్నాడు. సోమమ్మ నీరసంగా ఉందని చెప్పడంతో గొడవకు దిగాడు. ఇంటికి వచ్చేసరికి ఉండాలని చెప్పి అతడు బయటకు వెళ్ళిపోయాడు. శుక్రవారం తెల్లవారుజామున వచ్చిన నంద కోడి కూర వడ్డించాలని కోరగా.. ఆమె వండలేదని చెప్పడంతో దాడికి యత్నించాడు. ఆమె అరుస్తూ బయటకు పరిగెడుతూ ఉండగా వెంటాడి గొడ్డలితో నరికాడు. ఆమె కేకలు విన్న చుట్టుపక్కలవారు అక్కడికి చేరుకునేసరికి సోమమ్మ రక్తపు మడుగులో కొట్టుకుంటూ ప్రాణాలు వదిలింది. అతడిని గ్రామస్తులు చెట్టుకు కట్టేశారు. నిందుతుడిని అదుపులోకి తీసుకున్నామని సిఐ తెలిపారు.
ఇలాంటి ఘటనే నిరుడు నవంబర్ లో బీహార్ లో చోటు చేసుకుంది. కోడి కూర వండ లేదన్న కోపంతో భార్యాభర్తల మధ్య గొడవ ప్రాణాల మీదికి తీసుకువచ్చింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన యువతి ఇరుగుపొరుగు సహాయంతో ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచింది. చంపారన్ జిల్లాలోని బేతియా నగరంలో నాగేంద్ర సింగ్ అనే వ్యక్తి పోలీసులను ఆశ్రయించడంతో కేసు వెలుగులోకి వచ్చింది. తన అల్లుడు తన కూతురిని హత్య చేయాలని ప్రయత్నించాడని, ఆమె ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతోందని నాగేంద్ర సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పోలీసులు విచారణ చేయగా.. భార్యాభర్తల మధ్య జరిగిన చిన్నపాటి గొడవే ప్రాణాల మీదికి తెచ్చిందని తేల్చారు.
