అభం శుభం తెలియని ఆరేళ్ల చిన్నారికి చాక్లెట్ ఆశచూపి అత్యాచారానికి పాల్పడ్డాడో యువకుడు. ఈ అమానుషం కామారెడ్డి జిల్లా బిబిపేటలో చోటుచేసుకుంది.
కామారెడ్డి: పసిపాప నుండి పండుముసలి వరకు వయసులో సంబంధం లేకుండా ఆడబిడ్డలపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు కొందరు మృగాళ్లు. ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు చేసినా... పోలీసులు మరెంత కఠినంగా వ్యవహరించినా మహిళలకు రక్షణ మాత్రం దక్కడం లేదు. ప్రతి రోజు ఎక్కడోఅక్కడ మహిళలపై అఘాయిత్యాలు జరుగుతూనే వున్నాయి. చివరకు అభం శుభం తెలియని చిన్నారులనూ వదిలిపెట్టడం లేదు కామాంధులు. ఇలా ఓ ఆరేళ్ల చిన్నారిపై యువకుడు అత్యాచారానికి పాల్పడిన దారుణం తెలంగాణలో చోటుచేసుకుంది.
మెదక్ జిల్లా రామాయంపేట మండలం దొంగల ధర్మారం గ్రామానికి చెందిన రవి కామారెడ్డి జిల్లా (kamareddy district) బిబిపేట మండలకేంద్రంలోని అక్కవద్దకు వెళ్ళాడు. అయితే అక్కవాళ్ల ఇంటిపక్కన వుండే ఓ ఆరేళ్ల చిన్నారిపై అతడి కన్ను పడింది. అభం శుభం తెలియని ఆ చిన్నారిని ఎలాగయినా అనుభవించాలని నిర్ణయించుకున్న రవి నీచానికి పాల్పడ్డాడు.
అదును కోసం ఎదురుచూస్తున్న రవికి ఇంటిబయట ఒంటరిగా ఆడుకుంటున్న చిన్నారి కనిపించింది. ఇదే సరయిన సమయంగా భావించిన యువకుడు చాక్లెట్ ఇప్పిస్తానంటూ బాలికను వెంటతీసుకుని వెళ్లాడు. బాలికను నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి వివస్త్రను చేతి అతి దారుణంగా అత్యాచారానికి పాల్పడ్డాడు.
అసలేం జరుగుతుందో కూడా తెలీని చిన్నారి ఆ కామాంధుడి వికృతి చేష్టలకు విలవిల్లాడిపోయింది. బాలిక అరవకుండా నోరు మూసేసి నీచానికి పాల్పడ్డాడు. అత్యాచారం అనంతరం చిన్నారిని అక్కడే వదిలిపెట్టి నిందితుడు పరారయ్యాడు.
యువకుడి వికృత చేష్టలతో తీవ్ర అస్వస్థతకు గురయిన చిన్నారి ఇంటికి చేరుకుంది. బాలికపై అఘాయిత్యం జరిగినట్లు గుర్తించిన తల్లిదండ్రులు ఆరాతీయగా రవి తీసుకునివెళ్ళినట్లు బయటపడింది. అతడి అక్క ఇంట్లో వెతగ్గా అప్పటికే రవి పరారయినట్లు తెలిసింది. దీంతో బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేసారు.
కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. పరారీలో వున్న నిందితుడు రవి కోసం గాలిస్తున్నారు. బాలికను కూడా వైద్య పరీక్షల నిమిత్తం కామారెడ్డి జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఆమెపై అఘాయిత్యం జరిగినట్లు డాక్టర్లు కూడా నిర్దారించినట్లు తెలుస్తోంది.
ఆరేళ్ల చిన్నారిపై అఘాయిత్యానికి పాల్పడిన కామాంధున్ని కఠినంగా శిక్షించాలని బిబిపేట వాసులు కోరుతున్నారు. ఇలాంటి వారిని శిక్షిస్తేనే మరొకరు అమ్మాయిలపై చేయి వేయడానికి భయపడతారని అంటున్నారు.
