Asianet News TeluguAsianet News Telugu

జర్నలిస్టు ముసుగులో బీజేపీ కోసమే పని చేశావ్.. తీన్మార్ మల్లన్నపై మంత్రి కొప్పుల ఫైర్

బీజేపీలో చేరిన జర్నలిస్టు తీన్మార్ మల్లన్నపై మంత్రి కొప్పుల ఈశ్వర్ ఫైర్ అయ్యారు. ఇన్ని రోజులు జర్నలిస్టు ముసుగులో ఉండి బీజేపీ కోసమే పని చేశాడని ఆరోపించారు. 

you worked for BJP only in the guise of a journalist .. Minister Koppula fires on Teenmar Mallanna
Author
Hyderabad, First Published Dec 8, 2021, 6:42 PM IST

తీన్మార్ మల్లన్నగా చెప్పుకునే జర్నలిస్టు చింతపండు నవీన్ ఎప్పుడూ బీజేపీ కోస‌మే ప‌ని చేశాడ‌ని మంత్రి కొప్పుల ఈశ్వ‌ర్ ఆరోపించారు. బుధ‌వారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. చింత‌పండు న‌వీన్ యాంక‌ర్ మాత్ర‌మే అని జ‌ర్న‌లిస్టు కాడ‌ని ధ్వ‌జ‌మెత్తారు. ఆయ‌న ఏ మీడియా సంస్థ‌ల్లోనూ రిపోర్ట‌ర్ గా ప‌ని చేసిన దాఖలాలు లేవ‌ని అన్నారు. తీన్మార్ మ‌ల్ల‌న్న సంఘ్ ప‌రివార్ కు చెందిన వ్య‌క్తి అని ఆరోపించారు. అందుకే ఎప్పుడూ బీజేపీ అనుకూలంగా మాట్లాడుతూ టీఆర్ఎస్‌ను, ప్ర‌భుత్వాన్ని తీవ్రంగా ఆరోపించేవార‌ని అన్నారు. రాష్ట్రంలో రాజకీయ అస్థిర‌త్వాన్ని ఏర్ప‌రిచేందుకు ఆయ‌న ప్ర‌య‌త్నిస్తున్నార‌ని అన్నారు. తీన్మార్ మ‌ల్ల‌న్న త‌న‌ని తాను అతిగా అంచ‌నా వేసుకుంటున్నాడ‌ని, అందుకే ప‌గ‌టి క‌ల‌లు కంటున్నాడ‌ని విమ‌ర్శించారు. బ్లాక్ మెయిలింగ్ చ‌ర్య‌ల‌కు పాల్ప‌డినందుకే జైలు పాల‌య్యాడ‌ని తెలిపారు. రెండు నెల‌లు జైల్లో ఉన్నా..అత‌డిలో మార్పు రావ‌డం లేద‌ని అన్నారు. ఇప్ప‌టికైనా ప్ర‌భుత్వ పెద్ద‌ల‌పై అగౌర‌వంగా మాట్లడొద్ద‌ని సూచించారు. లేక‌పోతే చ‌ట్ట ప్ర‌కారం చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని హెచ్చ‌రించారు. 

https://telugu.asianetnews.com/telangana/bandi-sanjay-and-telangana-bjp-mps-mlas-likely-to-meet-amit-shah-tomorrow-r3s646
అరాచ‌క పాల‌న‌కు కేరాఫ్‌గా బీజేపీ..
అరాచక, నిరంకుశ పాలనకు బీజేపీ కేరాఫ్ గా ఉంద‌ని మంత్రి అన్నారు. బాబ్రీ మ‌సీదు కూల్చి, గోద్రాల్లో అల‌ర్ల‌కు పాల్ప‌డింది బీజేపీ కాదా అని ప్ర‌శ్నించారు ? క‌ర్నాట‌క‌, మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో కాంగ్రెస్ ను కూల్చి నిరంకుశంగా బీజేపీ అధికారం చేప‌ట్టింద‌ని గుర్తు చేశారు. కుటుంబ రాజ‌కీయాలు కూడా బీజేపీలోనే ఉన్నాయని అన్నారు. విజయరాజే సింధియా, వసుంధరా రాజే సింధియా, జ్యోతిరాధిత్య సింధియా వీళ్లంద‌రూ ఎన్ని కుటుంబాల‌కు సంబంధించిన వార‌ని ప్ర‌శ్నించారు. బీజేపీ కార్పోరేట్ శ‌క్తుల‌కు, పారిశ్రామికవేత్త‌ల‌కు అనుకూలంగా ప‌ని చేస్తుంద‌ని ఆరోపించారు. తెలంగాణ‌లో సీఎం కేసీఆర్ మంచి పాల‌న అందిస్తున్నార‌ని కొనియాడారు. తెలంగాణ ఉద్య‌మంలో అమ‌రులైన వారి కుటుంబాన్ని సీఎం ఆదుకున్నార‌ని తెలిపారు. వారి కుటుంబాల‌కు ప్ర‌భుత్వ ఉద్యోగాలు కూడా ఇచ్చార‌ని అన్నారు. ఇటీవ‌ల ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ లో స‌భ్యులుగా నియ‌మితులైన వారు ఉద్య‌కారులు కారా అని ప్ర‌శ్నించారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios