సంగారెడ్డి:నిజాం నవాబు హైద్రాబాద్ ను వదిలి వెళ్లేలా సర్ధార్ వల్లభాయ్ పటేల్ చేశారని  యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ గుర్తు చేశారు.తెలంగాణలో బీజేపీ సత్తాను చాటుతోందని యోగి ఆదిత్యనాథ్ అభిప్రాయపడ్డారు. 

సంగారెడ్డిలో ఆదివారం నాడు బీజేపీ ఎన్నికల ప్రచారసభలో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ పాల్గొన్నారు. మోడీ ప్రధానిగా ఎన్నికైన తర్వాత దేశంలో ప్రజల సంక్షేమం కోసం ఎంతగానో ప్రయత్నించారని చెప్పారు. 

ఓ సామాన్య కార్యకర్త ప్రధాన మంత్రిగా ఎన్నికయ్యారని.. బీజేపీలో  ఈ పరిస్థితి ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఈ పరిస్థితి లేదన్నారు.  గాంధీ కుటుంబమే ఇంకా కాంగ్రెస్ పార్టీని లీడ్ చేస్తోందని చెప్పారు. దళితుడిని సీఎం చేస్తానని చెప్పి కేసీఆర్ తెలంగాణ ప్రజలను మోసం చేశారని యోగి ఆదిత్యనాథ్ విమర్శించారు.