ప్రముఖ యోగా గురు రాం దేవ్ బాబా తెలంగాణలో పర్యటిస్తున్నారు. ఆయన నిజామాబాద్ లో పర్యటించారు. ఈ సందర్భంగా నిజామాబాద్ లో ఎంపి కవిత, స్థానిక ఎమ్మెల్యేలకు యోగా శిక్షణ ఇచ్చారు. స్థానికులు కూడా వందల సంఖ్యలో యోగా క్లాసుకు హాజరయ్యారు.

యోగా శిక్షణ తర్వాత రాం దేవ్ బాబా, మంత్రి హరీష్, ఎంపి కవిత మీడియాతో మాట్లాడారు. మీడియా సమావేశంలో రాందేవ్ బాబా యోగా టిప్స్ చెప్పారు. మీడియా ప్రతినిధుల కోసం ఈ టిప్స్ చెబుతున్న సందర్భంలో పక్కనే కూర్చున్న మంత్రి హరీష్ రావు ఫిదా అయిపోయారు. తదేకంగా రాందేవ్ బాబా వైపే చూస్తూ ఉండిపోయారు. రాందేవ్ బాబా పొట్ట ఆసనం చేస్తుండగా హరీష్ లీనమైపోయి చూశారు. వీడియో పైన ఉంది మీరూ చూడండి.