కృష్ణాజిల్లా జగ్గయ్యపేట వైసీపీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను తనయుడు సామినేని ప్రసాద్‌ హైదరాబాద్‌లో వీరంగం సృష్టించాడు. మాదాపూర్‌లో విధి నిర్వహణలో ఉన్న ట్రాఫిక్ ఇన్స్‌పెక్టర్ పట్ల ప్రసాద్ దురుసుగా ప్రవర్తించాడు.

ట్రాఫిక్ డైవర్షన్ విషయంలో ఇరువురి మధ్య ఘర్షణ చోటు చేసుకోవడంతో... ప్రసాద్ విచక్షణ కోల్పోయి ట్రాఫిక్ ఎస్ఐపై దాడికి పాల్పడ్డాడు. దీంతో పోలీసులు ప్రసాద్‌ను అదుపులోకి తీసుకుని మాదాపూర్ పీఎస్‌కు తరలించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.