Asianet News TeluguAsianet News Telugu

తెలుగు నేలమీద ‘వెల్ కం’ గ్రూప్

  • తెలంగాణ ఉద్యమం సృష్టించిన ఆణిముత్యం ‘వెల్ కం’ గ్రూప్
  • నాడు మాటలకే పరిమితం నేడు ఆచరణ రూపం
  • తెలుగు రాజకీయాల్లో సరికొత్త పరిణామమే అంటున్న జనాలు
  • ఎపి, తెలంగాణలో మారనున్న కుల సమీకరణాలు
would velamas and kammas form velkam political group in Telugu Politics

తెలంగాణ ఉద్యమం తెలంగాణ ప్రజలకే కాదు తెలుగు ప్రజలందరికీ అంతులేని సాహిత్య సంపదను అందించింది. ఉద్యమ కాలంలో కొత్త కొత్త పదజాలం, కొత్త కొత్త భాష, కొత్త యాస ఆవిర్భవించాయి. అందులోంచి పుట్టకొచ్చిన ఆనిముత్యాలలో వెల్ కం గ్రూప్ అనేది ఒకటి బాగా పాపులర్ అయింది. అయితే తాజా పరిణామ క్రమంలో అది ఆచరణ రూపు సంతరించుకుంటున్నది. ఆ వివరాలేంటో చూద్దాం.

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో కులాలు, కుల రాజకీయాలు, కులాల మధ్య స్నేహాలు ఎప్పటినుంచో ఉన్నవే. కుల ధ్వేషాలు కూడా అప్పుడో ఇప్పుడో పొడచూపిన దాఖలాలున్నాయి. కులాల స్నేహాలు మాత్రం రాజకీయాల్లో మనం చూస్తూనే ఉన్నాం. పైకి అలా కనబడకపోయినా లోలోపల మాత్రం కుల స్నేహాలు గట్టిగానే రాజకీయాల్లో ముద్ర వేస్తున్న పరిస్థితి కూడా ఉంది. తాజా రాజకీయాల్లో రెండు కులాల మధ్య స్నేహం బాగా ముదిరిపోతున్న పరిస్థితి ఉందని చెప్పవచ్చు. ఆ రెండింటిలో ఒక కులం ఒక రాష్ట్రంలో అధికారం చెలాయిస్తుండగా మరో కులం మరో రాష్ట్రంలో అధికారంలో ఉన్నది. ఆరెండు కులాలే వెలమ, కమ్మ.

తెలంగాణలో వెలమ సామాజికవర్గం అత్యంత తక్కువ జనాభా కలిగి ఉన్నది. కొన్ని ప్రాంతాల్లో అయితే వారి ఉనికి కూడా కనిపించదు. ఉత్తర తెలంగాణలో వెలమ ప్రజలు బాగానే కనిపిస్తారు కానీ దక్షిణ తెలంగాణలో అంతగా ప్రాభల్యం ఉన్నవారు కాదు. కానీ తెలంగాణ ఉద్యమాన్ని పట్టు వదలని విక్రమార్కుడి వలే నడపడంతో కేసిఆర్ కు కులంతో సంబంధం లేకుండా తెలంగాణ అంతటా ఫాలోయింగ్ పెరిగింది. అందుకే గత ఎన్నికల్లో ఆయన అధికారంలోకి రాగలిగారు. కానీ ఎపిలో పరిస్థితి వేరేగా ఉంది. కమ్మ కులస్థులు ఎపిలో చాలా ఎక్కువ సంఖ్యలో ఉంటారు. దాదాపుగా ఎపి జనాభాలో 6శాతంగా ఉన్నట్లు లెక్కలు చెబుతున్నయి. తెలంగాణలో వెలమ జనాభా ఒక శాతం కంటే తక్కువే. ఈ నేపథ్యంలో ఎపిలో కమ్మ సామాజిక వర్గం వారు అధికారంలో ఉన్నారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఎపిని గాడిలో పెట్టగల సమర్థుడు చంద్రబాబే అన్న ఆలోచనతో కులాలకు అతీతంగా అక్కడ కూడా జనాలు టిడిపికి ఓట్లేసి అక్కడ అధికారం ఇచ్చారు చంద్రబాబుకు.

కానీ పరిణామ క్రమంలో చంద్రబాబు, కేసిఆర్ మధ్య వైరం కొంతకాలం నడిచింది. ఆ వైరాన్ని కూడా ఇద్దరి మధ్య కంటే రెండు కులాల మధ్య వైరంగా అప్పట్లో  జనాలు చెప్పుకునేవారు. ఓటుకు నోటు కేసు, ఫోన్ ట్యాపింగ్ కేసుల ఫలితంగా ఆ వైరం తారా స్థాయికి చేరింది. చంద్రబాబును బ్రహ్మ దేవుడు కూడా రక్షించలేడు అని కేసిఆర్ మాట్లాడితే... కేసిఆర్ పతనం ఎంతో దూరంలో లేదంటూ చంద్రబాబు కామెంట్లు చేశారు. కానీ కారాణాలేమయ్యాయో ఏమో కానీ వీరిద్దరూ స్నేహితులయ్యారు. తర్వాత బెస్ట్ ఫ్రెండ్స్ అయిపోయారు. దీంతో ఇప్పుడు ఈ బంధం రెండు రాష్ట్రాల సిఎంల మధ్యే కాకుండా రెండు కులాల మధ్య స్నేహంగా మారిపోయిందన్న ప్రచారం ఉంది.

కేసులు ఏమైనయో తెలియదు. అంతా గప్ చుప్ అయింది. స్నేహం మరింతగా విస్తరించింది. కేసిఆర్ యాగం చేస్తే చంద్రబాబు హాజరయ్యారు. ఎపిలో అమరావతి కేపిటల్ నిర్మాణానికి కేసిఆర్ వెళ్లారు. తర్వాత మరింతగా బంధం పెనవేసుకుపోయింది. ఇదే సమయంలో తెలంగాణలో ఉన్న కమ్మ సామాజికవర్గం అంతా కేసిఆర్ ప్రభుత్వంలో, టిఆర్ఎస్ పార్టీలో చేరిపోయింది. దీంతో వైరం అనేది ఎక్కడా కనబడిన దాఖలాలు లేకుండాపోయాయి. ఇక అనంతపురంలో జరిగిన పరిటాల శ్రీరాం వివాహం మరోసారి ఇద్దరు సిఎంలను, కమ్మ వెలమ కులాలనూ కలిపాయన్న చర్చ ఇప్పటికే రాజకీయ వర్గాల్లో జోరందుకున్నది. 

తెలంగాణ ఉద్యమ కాలంలో కులాల చర్చ సందర్భంగా వెల్ కం గ్రూప్ అని చర్చనీయాంశంగా ఉండేది. వెల్ కం గ్రూప్ అంటే వెలమ కమ్మ గ్రూప్ అని అర్థంగా చెప్పేవారు. అయితే అంతకంటే ముందే కులాల మధ్య స్నేహానికి చాలా పేర్లే ఉన్నయి. కామ్రెడ్ లు అంటే కమ్మా, రెడ్డీలు కలిస్తే కామ్రెడ్ లు అన్న ప్రచారం చాలాకాలం నడిచింది. ఇఫ్పటికీ నడుస్తూనే ఉంది. కానీ వెల్ కం గ్రూప్ అనేది మాత్రం తెలంగాణ ఉద్యమ కాలంలోనే పుట్టుకొచ్చింది. ఎవరు ఆ పేరు పెట్టారో తెలియదు కానీ ఎంతో ముందుచుపుతోనే ఆ పేరు పెట్టినట్లు కనబడుతోంది. ఎందుకంటే ఆ పేరు ఇటీవల కాలంలో ఆచరణ రూపు తీసుంటున్న పరిస్థితిని మనం తాజా రాజకీయాల్లో చూడొచ్చు కదా?

Follow Us:
Download App:
  • android
  • ios