Asianet News TeluguAsianet News Telugu

‘మేడ్ ఇన్ చైనా’ దేవుళ్లను రానిస్తారా ?

  • తీవ్రతరం అవుతున్న చైనా వస్తువుల బహిష్కరణ ఉద్యమం
  • సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న జాతీయవాదుల పోస్టులు
  • పాలక పక్షాలకు మాత్రం చైనా ప్రాజెక్టులపైనే మోజు
  • దేవుళ్ల భారీ విగ్రహాలన్నీ చైనా నుంచే దిగుమతి
would deshbakths allow  made in china gods to be worshiped

ఇటీవల కాలంలో జాతీయ వాదులు, దేశభక్తులు చైనాను టార్గెట్ చేస్తున్నారు. చైనా వస్తు బహిష్కరణకు పిలుపునిస్తున్నారు. సోషల్ మీడియాలో చైనా మీద పెద్ద యుద్ధమే చేస్తున్నారు జాతీయవాదులు. చైనాలో తయారైన ఏ వస్తువు కూడా వాడొద్దని తుదకు అన్నా చెల్లెల అనుబంధానికి ప్రతీక అయిన రాఖీలను కూడా త్యజించాలంటూ సోషల్ మీడియాలో పోస్టులు చక్కర్లు కొడుతున్నాయి. గతంలో చైనాలో తయారైన బాంబులు (పటాకులు) కూడా వాడొద్దని పిలుపునిచ్చారు. ఆ పిలుపు ఫలితం బాగానే కనిపించింది. ఈఏడాది దీపావళికి పటాకుల చప్పుడు బాగానే తగ్గిపోయింది. ఆమేరకు కాలుష్యం కూడా భారీగానే తగ్గిందనుకోండి. దీనికి జపాన్ ను ఉదాహరణగా చెబుతున్నారు. జపాన్ దేశస్తులు అమెరికా వస్తువులను వాడకుండా ఎలా స్ట్రిక్ట్ గా ఉంటారో అలాగే మనం చైనా వస్తువులు వాడకుండా ఉండాలంటూ ప్రకటనలు చేస్తున్నారు.

would deshbakths allow  made in china gods to be worshiped

మరి చైనా నుంచి ఇండియా భారీ దేవుళ్ల విగ్రహాలను దిగుమతి చేసుకుంటోంది. దానిపై ఇప్పటికే దేశంలోని పలు రాష్ట్రాల ప్రతినిధులు చైనాకు వెళ్లి అక్కడి కంపెనీలతో మాట్లాడుకున్నారు. ఇందులో భాగంగానే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యాదాద్రిలో 108 అడుగుల హనుమాన్ విగ్రహాన్ని నెలకొల్పేందుకు ప్లాన్ చేసింది. యాదాద్రి టెంపుల్ డెవలప్ మెంట్ అథారిటీ అధికారులు చైనాలో పర్యటించారు. అక్కడి కంపెనీలతో చర్చించారు. యాదాద్రిలో హనుమాన్ విగ్రహాన్ని నెలకొల్పేందుకు చైనా కంపెనీల ప్రతినిధులతో చర్చలు జరిపారు. వారి నుంచి కొటేషన్లు కూడా సేకరించారు.

ఇదే కాకుండా హుస్సేన్ సాగర్ లో భారీ అంబేద్కర్ విగ్రహాన్ని కూడా చైనాలోనే తయారు చేయిస్తోంది తెలంగాణ సర్కారు. దీనిపై ఇప్పటికే చైనా కంపెనీలతో తెలంగాణ మంత్రివర్గం, అధికారుల బృందం జరిపిన చర్చలు కొలిక్కి వచ్చాయి. త్వరలోనే చైనా నుంచి అంబేద్కర్ భారీ విగ్రహం హుస్సేన్ సాగర్ తీరాన కొలువుదీరనుంది. 125 అడుగుల ఎత్తులో అత్యంత భారీ విగ్రహాన్ని నెలకొల్పనుంది తెలంగాణ సర్కారు.

ఇక ఎపి రాజధాని అమరావతిలో అత్యంత భారీ బుద్ధ విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి ప్లాన్ చేస్తోంది ఎపి సర్కారు. ఈ విగ్రహాన్ని కూడా చైనాలోనే తయారు చేయించేందుకు కసరత్తు చేస్తోంది ఎపి ప్రభుత్వం. దీనిపై ఇప్పటికే సంప్రదింపులు కూడా జరిపింది అధికార యంత్రాంగం. దీంతోపాటు మరో భారీ విగ్రహం కూడా తయారు చేయించే యోచనలో ఎపి ప్రభుత్వం ఉంది. ఎన్టీఆర్ విగ్రహాన్న కూడా తయారు చేయించి ప్రతిష్టించే యోచనలో ఎపి సర్కారు ఉంది. దీన్ని చైనాలో చేయిస్తారా? లేక ఇండియాలో చేయిస్తారా ఇంకా తేలలేదు.

మొత్తానికి చైనా వస్తువులు బహిష్కరించండి అంటూ ఒకవైపు జాతీయ వాదులు ఉద్యమాలు చేపడుతున్న తరుణంలో మరోవైపు పాలక వర్గాలు మాత్రం చైనా వస్తువులే ముద్దు అంటున్నాయి. మరి చైనాలో తయారైన హనుమాన్, బుద్ధ భగవాన్ విగ్రహాలను, రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ విగ్రహాలను చైనా నుంచి రానిస్తారా లేదా అన్నది ఇప్పుడు చర్చనీయాంశమైంది.

జాతీయ వాదుల పనితీరు చూస్తే దేవుళ్లు కూడా భయపడిపోయే పరిస్థితి నెలకొందంటున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios