తెలంగాణ దేశపతికి ఆస్ట్రేలియాలో షాక్

తెలంగాణ దేశపతికి ఆస్ట్రేలియాలో షాక్

తెలంగాణ కవి గాయకుడు దేశనతి శ్రీనివిస్ కు ఆస్ట్రేలియాలో ఊహించని షాక్ తగితింది. ప్రపంచ తెలుగు మహా సభల సన్నాహక కార్యక్రమంలో భాగంగా దేశపతి ఇటీవల ఆస్ట్రేలియా వెళ్లారు. ఈ సందర్భంగా సిడ్నీలో తెలంగాణ పీసీసీ ఎన్నారై సెల్ ఆధ్వర్యంలో దేశపతిని అడ్డుకున్న కాంగ్రెస్ శ్రేణులు అయన సభలో పాల్గొనకుండా ఘెరావ్ చేసారు. 

వివరాల్లోకి వెళితే ప్రపంచ తెలుగు మహా సభలు హైదరాబాద్ తెలంగాణ ప్రభుత్వం వైభవంగా నిర్వహించాలని భావిస్తున్న విషయం తెలిసిందే. ఇందుకోసం వివిధ దేశాల్లో కోఆర్డినేటర్లను నియమిస్తున్నారు. ఇందులో భాగంగా ఆస్ట్రేలియాలో కూడా కోఆర్డినేటర్లను నియమించారు. అయితే  ఎటువంటి భాష పరిజ్ఞానం , సాహిత్య పరిచయం లేని వ్యాపార వేత్తలైన ఎన్నారై కోఆర్డినేటర్ లుగా నియమించారని  టీపీసీసీ ఎన్నారై సెల్ ఆరోపిస్తోంది. అందుకు నిరసనగా ఇవాళ సన్నాహక కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన దేశపతిని ఘెరావ్ చేసి నిరసన తెలిపారు.


ఈ సంధర్భంగా ఎన్నారై కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ..అమెరికా లో నివాసం ఉంటున్న మహేష్ బిగాల ను ఏ ప్రతిపాదికన  తెలుగు సభల కోఆర్డినేటర్ గా నియమించారని ప్రశ్నించారు. ఎటువంటి భాష పరిజ్ఞానం ,సాహిత్యం తెలియని వారిని నియమించడం వెనుక రాజకీయ ప్రయోజనం ఉందని వారు ఆరోపించారు. వెంటనే ఇలాంటి కోఆర్డినేటర్లను తొలగించి ఆ స్థానం లో సాహిత్య వేత్త లకు చోటు కల్పించాలని కోరారు. మహేష్ బిగాల నియామకం చట్టరీత్య కూడా చెల్లదని, ఆయన్నిఏ ప్రతిపాదికన నియమించారో కూడా తెలీదని అన్నారు. ఆయన్ని వెంటనే విధుల నుండి తప్పించాలని     డిమాండ్ చేసారు. 
 

దేశపతి కులాన్ని కించపరచాడంటూ ఎన్నారై ల మరో నిరసన  

గతం లో ఒక టివి ఛానల్ లో దేశపతి శ్రీనివాస్ ఓ కులాన్ని కించపర్చేలా మాట్లాడాడని పేర్కొంటూ  పలువురు ఎన్నారై లు నిరసన తెలిపారు. కులం పేరుతో రాజకీయాలు చేయడం తగదని, ఇకనైనా కులాలను దూషించడం మానుకోవాలని దేశపతికి సూచించారు. దేశపతి వెంటనే తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసారు. 
ఈ వివరాలను పీసిసి మీడియాకు వెల్లడించింది.

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos

MORE FROM Telangana

Next page