అమెరికాలో ప్రపంచ తెలంగాణ మహాసభలు

World Telangana Convention 2018 In America
Highlights

ప్రపంచ తెలంగాణా మహాసభలకు అమెరికాలో వేడుక సిద్ధమైంది.

ప్రపంచ తెలంగాణా మహాసభలకు అమెరికాలో వేడుక సిద్ధమైంది. టెక్సాస్ రాష్ట్రంలోని హ్యూస్టన్ నగరంలో ఉన్న జార్జ్ బ్రౌన్ కన్వెన్షన్ సెంటర్‌లో జూన్ 29, 2018వ తేదీ నుండి జులై 1, 2018వ తేదీ వరకూ మొత్తం మూడు రోజుల పాటు ఈ వేడుకలు జరగనున్నాయి. 

అమెరికన్ తెలంగాణా అసోసియేషన్ (ఆటా) నిర్వహిస్తున్న ఈ  వేడుక కోసం భారతదేశం నుంచి పలువురు ప్రముఖులు అమెరికాకు విచ్చేయనున్నారు. వీరిలో తాజా విడుదలైన మహానటి చిత్రంలో సావిత్రి పాత్ర పోషించి మనందరినీ మెప్పించిన కీర్తి సురేష్, డైరెక్టర్ నాగ అశ్విన్, హీరో విజయ్ దేవర కొండ మరియు దుల్కర్ సల్మాన్ ఉన్నారు.

ఇంకా ప్రముఖ జానపద గాయకుడు శివనాగులు, మధుప్రియ, మ్యూజిక్ డైరెక్టర్ శివమణి, చంద్రబోస్, వందేమాతరం శ్రీనివాస్, యాంకర్ ఉదయభాను తదితరులు ఈ కార్యక్రమం కోసం విచ్చేయనున్నారు. తెలంగాణా ఆవిర్భాన్ని, సంస్కృతిని గుర్తు చేస్తూ జరుపుకుంటున్న ఈ వేడుకలు జయప్రదం కావాలని కోరుకుందాం.

అమెరికాలో జరగనున్న ఈ వేడుకలకు సంబంధించిన పూర్తి అప్‌డేట్స్‌ను ఈ క్రింది ఫేస్‌బుక్ పేజ్ ద్వారా తెలుసుకోవచ్చు.
https://www.facebook.com/ATATelanganaSeattle/

ఎప్పుడు: June 29, 30th and July 1st 2018
ఎక్కడ: George R Brown Convention Center, Houston, Texas

loader