మనుషుల అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం( వరల్డ్ డే అగైనెస్ట్ ట్రాఫికింగ్ ఇన్ పర్సన్స్ ) సందర్భంగా సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్లో సోమవారం వర్క్ షాప్ ను నిర్వహించారు. సైబరాబాద్ షీ టీమ్స్, మహిత సంస్థ, ప్లాన్ ఇండియా, గర్ల్ అడ్వొకెసి అలియన్స్ ఆధ్వర్యంలో ఈ వర్క్ షాప్ ను ఏర్పాటు చేశారు. 2013వ సంవత్సరం నుంచి ప్రతీ సంవత్సరం జులై 30న ఈ రోజును జరుపుకుంటున్నారు.

ఈసారి ఎండ్ హ్యూమన్ ట్రాఫికింగ్ అనే థీమ్ ప్రకారం ఈ వర్క్ షాప్ ఏర్పాటు చేశారు.  ద యునైటెడ్ నేషన్స్ ఆఫీస్ ఆన్ డ్రగ్స్ అండ్ క్రైమ్స్ (యుఎన్ఒడిసి) సంస్థ బ్లూ హార్ట్ కాంపెయిన్ ద్వారా పలు దేశాల్లో హ్యూమన్ ట్రాఫికింగ్ పై అవగాహన కల్పిస్తోంది.

ఈ సందర్భంగా డాక్టర్ రెటైర్డ్ ఐజి ఎస్. ఉమాపతి మాట్లాడుతూ మనుషుల అక్రమ రవాణా హేయమైన చర్య అన్నారు. ప్రపంచంలో డ్రగ్స్, ఆయుధాల సరఫరా తరువాత మానవ అక్రమ రవాణా ఆందోళన కలిగిస్తుందన్నారు. ''స్వలాభం కోసం కొందరు మనుషులను కొనడం, అమ్మడం చేస్తుంటారు. అక్రమ రవాణాకు గురైన వారిని ఎక్కువగా సెక్స్ వర్కర్లుగా, అడాప్షన్ రాకెట్లలో,కూలీలుగా, బాలకార్మికులుగా, మొలెక్యులర్ టెస్టింగ్ సంస్థల్లో, బెగ్గింగ్ (బిచ్చగాళ్ళు) గా మారుస్తున్నారు’’ 

‘‘వీరి అవయవాలను అమ్ముకోవడం శోఛనీయం. సినిమాలు, టి‌విల్లో అవకాశాలు ఇప్పిస్తామని చెబుతూ ఎక్కువగా మధ్యతరగతి మహిళలను ఈ ఊబిలోకి లాగుతారు. కొందరు మహిళలు, పిల్లలను కిడ్నాప్ చేసి అమ్మకానికి పెడతారు. ఇటుక బట్టీలు, గాజుల పరిశ్రమల్లో బాల కార్మికులు ఎక్కువగా ఉన్నార''న్నారు. పోలీసులు, స్వచ్ఛంద సంస్థలు కలిస్కట్టుగా పనిచేస్తే మనుషుల అక్రమ రవాణాను నివారించవచ్చ’’న్నారు.

      అనంతరం  సైబరాబాద్ షీ టీమ్స్ డి‌సి‌పి డాక్టర్ అనసూయ మాట్లాడుతూ ముందుగా వర్క్ షాప్ కు వచ్చిన వారికి కృతజ్ఞతలు తెలిపారు. మనుషుల అక్రమ రవాణా లో ఎక్కువగా మహిళలు, పిల్లలు ఉండడం అంధోళన కలిగిస్తుందన్నారు. హ్యూమన్ ట్రాఫికింగ్ ని నివారించేందుకు సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ నేతృత్వంలో అలుపెరగకుండా పనిచేస్తున్నామన్నారు.

సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఆపరేషన్ స్మైల్, ఆపరేషన్ ముస్కాన్ వంటి కార్యక్రమాలతో ఎంతో మండి చిన్నారుల జీవితల్లో వెలుగు నింపామన్నారు. ఇటీవల 90 మండి చిన్నారులకు వెట్టి నుంచి విముక్తి కల్పించామన్నారు.  అనంతరం వర్క్ షాప్ లో పాల్గొన్న వారిని మర్యాదపూర్వకంగా సన్మానించారు.