మండుటెండల్లో తీసుకెళ్లి మాకు నరకం చూపించారని రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ కు చెందిన కొందరు మహిళలు స్థానిక టీఆర్ఎస్ నేతలపై మండిపడ్డారు.

వరంగల్ లో అధికార టీఆర్ఎస్ పార్టీ నిర్వహించిన సభపై మహిళాలోకం భగ్గు మంటుంది. నియోజకవర్గాల వారీగా టార్గెట్లు పెట్టి మరీ జనాలను తీసుకరావాలని శ్రేణులకు ఆదేశాలు వెళ్లడంతో వాళ్లంతా కష్టపడి జనసమీకరణ చేశారు.

అన్ని పార్టీల వాళ్లు ఇచ్చినట్లే సభకొచ్చే వారికి భోజన ఏర్పాట్లతో పాటు మనిషికి నియోజకవర్గాల వారీగా రూ. 400 నుంచి రూ. 500 వరకు ఇచ్చినట్లు తెలిసింది. అయితే మండటెండల్లో సభకొచ్చిన వారికి టీఆర్ఎస్ శ్రేణులు తాగడానికి నీళ్లు కూడా ఇవ్వలేదట.

మండుటెండల్లో తీసుకెళ్లి మాకు నరకం చూపించారని రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ కు చెందిన కొందరు మహిళలు స్థానిక టీఆర్ఎస్ నేతలపై మండిపడ్డారు.

సభకు వస్తే 500 రుపాయాలు ఇస్తాం అన్నారు. అదీ ఇవ్వలేదు. అంత దూరం వస్తే కనీసం తాగడానికి నీళ్లు కూడా ఇవ్వలేదు. ఇకపై ఏ సభ పెట్టిన మేం రాము అని గులాబీ నేతల ముఖం ముందే చెప్పేశారు.