వసూల్ రాజా అన్న పేరు బాగానే విన్నాము. అట్లనే వసూల్ రాణి పేరు కూడా వినే ఉంటారు. కలెక్షన్ కింగ్.. కలెక్షన్ క్వీన్ అన్న బిరుదులు కూడా పాపులర్ అయినవే. తాజాగా హైదరాబాద్ లో అధికార టిఆర్ఎస్ పార్టీలో ఒక వసూల్ రాణి వ్యవహారం వెలుగులోకి వచ్చింది.

బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం తాను ఇల్లు కట్టుకోవడానికి శాంతా దేవి అనే టిఆర్ఎస్ నాయకురాలు 10 లక్షలు డిమాండ్ చేసిందని ఆరోపించారు. ఈ ఘటన పాత బస్తీలోని దారుసలేంలో జరిగింది. బాధితుడు ఉమేష్ శర్మ తనకు ఎదరైన అనుభవాలను మీడియాకు వెల్లడించారు.

జిహెచ్ఎంసి అనుమతులు ఉన్నప్పటికీ డబ్బుల  కోసం తనను శాంతాదేవి బెదిరింపులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. తనను వేధించడమే కాకుండా జిహెచ్ఎంసి అధికారుల పై వత్తిడి తెచ్చి నిర్మాణం లో ఉన్న ఇంటిని కూలగొట్టించారని ఆరోపించారు. ప్రభుత్వం కలుగజేసుకొని  తనకు న్యాయం చేయాలని కోరారు. తనపై బెదిరింపులకు పాల్పడుతున్న శాంతాదేవి ఆమె అనుచరుల పై చర్యలు తీసుకోవాలని కోరారు.

బాధితుడు ఏం మాట్లాడిండో కింద వీడియోలో చూడండి.