మహిళ కోసం తెలంగాణ ప్రభుత్వం ఎన్నో పథకాలు ప్రవేశపెట్టిందని మంత్రి సత్యవతి రాథోడ్, సబితా ఇంద్రారెడ్డిలు అన్నారు. శుక్రవారం వారు ఇద్దరు కలిసి హైదరాబాద్ లోని టీఆర్ఎస్ ఎల్పీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. మహిళ దినోత్సవం సందర్భంగా టీఆర్ఎస్ తరుఫున ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు.
ఈ నెల 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం నేపథ్యంలో టీఆర్ఎస్ తరుఫున మూడు రోజుల పాటు వేడుకలు నిర్వహిస్తామని మంత్రి సత్యవతి రాథోడ్ (minister satyavathi rathod) తెలిపారు. శుక్రవారం మరో మంత్రి సబితా ఇంద్రారెడ్డి (minister sabitha indrareddy)తో కలిసి టీఆర్ఎస్ ఎల్పీ కార్యాలయం ((trslp office)లో ఆమె మీడియాతో మాట్లాడారు.
ఈ మీడియా సమావేశం సందర్భంగా మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ.. తెలంగాణ (telangana) రాష్ట్ర వ్యాప్తంగా 6వ తేదీ నుంచి 8వ తేదీ వరకు మహిళా దినోత్సవ (womens day) వేడుకలు ఘనంగా నిర్వహిస్తామని అన్నారు. ఈ వేడుకల్లో భాగంగా టీఆర్ఎస్ (trs) ప్రభుత్వం వల్ల మహిళలకు అందిన ఫలాలను అందరికీ వివరిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా ముందుగా 6వ తేదీన ప్రతీ గ్రామంలో సీఎం కేసీఆర్ (cm kcr) ఫొటోకు రాఖీ కట్టే కార్యక్రమం చేపడుతామని అన్నారు. 7వ తేదీన కల్యాణలక్ష్మీ (kalyanalakshmi), కేసీఆర్ కిట్ (kcr kit) లబ్దిదారుల కుటుంబాలతో భేటీ అవుతామని తెలిపారు. 8వ తేదీన వివిధ కార్యక్రమాలు చేపడుతామని అన్నారు.
కరోనా సమయంలో క్షేమంగా చూసుకున్నాం - మంత్రి సబితా ఇంద్రారెడ్డి
కరోనా విజృంభించిన సమయంలో మహిళలకు, గర్భిణులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తెలంగాణ ప్రభుత్వం క్షేమంగా తీసుకుందని మంత్రి సబితా ఇంద్రారెడ్డి (minister sabitha indrareddy) అన్నారు. తెలంగాణ సీఎంగా కేసీఆర్ (cm kcr) బాధ్యతలు చేపట్టిన తరువాత సమాజంలో మార్పు కోసం ప్రయత్నం చేస్తున్నారని కొనియాడారు. గతంలో ఎండాకాలంలో నీళ్ల కోసం మహిళలు ఎన్నో ఇబ్బందులు పడేవారని గుర్తు చేశారు. కానీ కేసీఆర్ సీఎం అయ్యాక మహిళలకు నీళ్ల కష్టం లేకుండా చేశారని చెప్పారు.
కేసీఆర్ ప్రభుత్వంలో మహిళల భద్రతపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని తెలిపారు. ఈ నేపథ్యంలోనే షీ టీమ్స్ (she teams) ఏర్పాటు చేసిందని అన్నారు. పోలీస్ శాఖలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు తీసుకొచ్చారని గుర్తు చేశారు. NRI వేధింపులను అరికట్టేందుకు ప్రత్యేక NRI సెల్ సీఎం ఏర్పాటు చేశారని అన్నారు. మహిళలకు ఆర్థిక భద్రత కోసం వడ్డీ లేని రుణాలు టీఆర్ఎస్ ప్రభుత్వం అందిస్తోందని చెప్పారు.
మహిళలు రాజకీయంగా ఎదగాలని సీఎం కేసీఆర్ ఎప్పుడూ కోరుకుంటారని మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. పలు నామినేటెడ్ పోస్టు (nominated posts)లు మహిళలకు కేటాయించి ప్రత్యేక రిజర్వేషన్లు సీఎం కల్పించారని తెలిపారు. మూడు రోజుల పాటు జరిగే మహిళా దినోత్సవ వేడుకల్లో తెలంగాణ మహిళలందరూ పాల్గొనాలని కోరారు.
మంత్రి శ్రీనివాస్ గౌడ్ (minister srinivas goud)పై హత్య కుట్ర ఘటనపై విచారణ జరుగుతోందని మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. అలాంటి ఘటనలను ఎవ్వరూ ప్రోత్సహింబోరని స్పష్టం చేశారు. కచ్చితంగా అలాంటి అంశాలను ఖండించాల్సిందే అని అన్నారు. విచారణ జరుపుతున్నామని, ఈ విచారణలో అన్ని నిజాలు బయటపడుతాయని తెలిపారు. శ్రీనివాస్ గౌడ్ హత్య కుట్ర ఘటనను విపక్షాలు కేవలం ఆరోపణలు మాత్రమే అంటున్నాయని చెప్పారు. కానీ విచారణ జరుగుతోందని దోషులు ఎవరో పోలీసులే తేల్చుతారని తెలిపారు.
