దెయ్యాలు ఉన్నాయని భూతం పేరుతో ఒక మోసగాడు యువతిని అత్యచారం చేసి పరారయ్యాడు. బాధితురాలి తల్లిదండ్రులను సైతం బురిడి కొట్టించాడు.హైదరాబాద్ నగరంలో జరిగిన ఈ ఘటన ప్రతి ఒక్కరిని ఆశ్చర్యానికి గురించి చేసింది. 

అమిర్ పెట్ లో నివాసం ఉంటున్న దంపతులు 19 ఏళ్ల కూతురిని తీసుకొని మళ్లేపల్లి భూత వైద్యుడిగా చెప్పుకుంటున్న ఆజంని కలిశారు. తమకు చాలా ఆటంకాలు ఎదురవుతున్నాయని ఏ పని చేసినా కలిసిరావడం లేదని అతనికి చెప్పగా మీ ఇంట్లో ఒక దెయ్యం ఉందని దాన్ని బయటకు పంపకుంటే చాలా ముప్పు అని వారిని ఆజం భయపెట్టాడు. 

తాను చెప్పినట్లు చేయాలనీ వారిని బీదర్ లో ఉన్న దర్గాకు తీసుకెళ్లాడు. అక్కడ దంపతుల కూతురిని ప్రయివేట్ గా కలుసుకొని తనను పెళ్లి చేసుకుంటే మీ సమస్యలు అన్ని తీరిపోతాయని, లేకుంటే మీ అమ్మా నాన్న రక్తం కక్కుకొని చచ్చిపోతారని ఆజం యువతిని బెదిరించాడు. అనంతరం ఆమెపై అత్యాచారం చేసి పరారయ్యాడు. దీంతో వెంటనే యువతి కుటుంబీకులు పోలీసులకు సమాచారాన్ని అందించారు. ప్రస్తుతం ఆజం కోసం పోలీసులు గాలిస్తున్నారు.