హైదరాబాద్: హైద్రాబాద్ నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ(నిఫ్ట్)  లో  హౌస్ కీపింగ్‌లో పనిచేస్తున్న ఉద్యోగినులు అక్కడ పనిచేసే ఉన్నతాధికారిపై ఆరోపణలు  చేశారు. ఆ ఉన్నతాధికారి తమను లైంగికంగా వేధింపులకు గురి చేస్తున్నాడని  వారు ఆరోపించారు. 

నిఫ్ట్‌లో పనిచేసే ఓ ఉన్నతోద్యోగి  హౌస్ కీపింగ్‌లో పనిచేసే మహిళల పట్ల  లైంగికంగా వేధింపులకు పాల్పడ్డారని  బాధితులు ఆరోపించారు. కార్యాలయంలో పనిచేసే  మహిళ ఉద్యోగినుల పట్ల ఓ ఉన్నత ఉద్యోగి అసభ్యంగా ప్రవర్తించేవాడని మహిళలు ఆరోపిస్తున్నారు.

ఆ ఉన్నతోద్యోగి  ఛాంబర్‌లో పనిచేసేందుకు మహిళలు భయపడుతున్నారు. హౌస్ కీపింగ్ సూపర్ వైజర్ మహిళను తన ఛాంబర్ వద్ద అందమైన మహిళలకు డ్యూటీ వేయాలని కోరేవాడని  చెప్పారు.

ఈ విషయమై తమకు న్యాయం చేయాలని  అడ్మినిస్ట్రేషన్ విభాగాన్ని కోరినా ప్రయోజనం లేకపోయిందని బాధితులు ఆరోపిస్తున్నారు.  మరో వైపు తనకు సహకరిస్తే  మీ భవిష్యత్  బాగుంటుందని అనేవాడని  మహిళలు చెబుతున్నారు.  ఈ విషయమై  తాము పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు  బాధితులు చెప్పారు.  అయినా తమకు ప్రయోజనం లేదన్నారు. 

 

సంబంధిత వార్తలు

#మీ టూ ఎఫెక్ట్: మంత్రి పదవికి ఎంజె అక్బర్ రాజీనామా