తెలంగాణ అటవీ శాఖకు చెందిన ఓ మహిళా అధికారిని తనను ఉన్నతాధికారి వేధిస్తున్నాడంటూ సీఎస్ సోమేష్ కుమార్ కు లేఖ రాసింది.
హైదరాబాద్ : రాజకీయాల్లో మహిళలకు ప్రత్యేక రిజర్వేషన్లు, రక్షణ కోసం ప్రత్యేక చట్టాలు.... ఇలా ప్రభుత్వాలు ఎంతచేసినా మహిళా సాధికారత అనేది ఇంకా సాధ్యంకావడం లేదు. పురుషులతో సమానంగా హోదాను కలిగి ఉన్నతస్థాయిలో వున్న మహిళా ఉద్యోగినులకు సైతం పనిచేసే ప్రదేశాల్లో వేధింపులు తప్పడం లేదు. ఇలా తెలంగాణలో ఓ జిల్లాలో అటవీశాఖ సూపరింటెండెంట్ గా పనిచేస్తున్న మహిళకు ఉన్నతాధికారి నుండి వేధింపులు తప్పలేదు. తన ఆవేదనను బాధిత మహిళా అధికారిని రాష్ట్ర చీఫ్ సెక్రటరీ దృష్టికి తీసుకువెళ్లడంతో విషయం వెలుగులోకి వచ్చింది.
కొంతకాలంగా తాను ఉన్నతాధికారి చేతిలో తీవ్ర వేధింపులకు గురవుతున్నట్లు ఓ జిల్లాస్థాయి అధికారిని తెలంగాణ అటవీ, పర్యావరణ శాఖకు ఫిర్యాదు చేసింది. అంతేకాకుండా రాష్ట్ర, జాతీయ మహిళా కమీషన్లకు కూడా సదరు ఉన్నతాధికారి వేధింపులపై ఫిర్యాదు చేసింది. దీంతో తనపై ఉన్నతాధికారి వేధింపులు మరీ ఎక్కువ కావడంతో ఇక భరించలేకపోయిన బాధితురాలు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్వి సోమేష్ కుమార్ కు లేఖ రాసారు.
తనకు ఎదురైన వేధింపులపై మహిళా అధికారినితో విచారణ జరిపి నివేదిక పంపుతామని మహిళా కమీషన్ కు తెలిపారని బాధితురాలు గుర్తుచేసారు. కానీ చివరకు తనను వేధించిన అధికారే విచారణ చేపట్టి ఏం తప్పు చేయలేదన్నట్లుగా మహిళా కమీషన్ కు నివేదిక పంపాడని బాధిత ఉద్యోగిని సీఎస్ దృష్టికి తీసుకెళ్లింది.
read more మారేడ్‌పల్లి సీఐ నాగేశ్వరరావుపై వరుస కేసులు.. అనుమానాలు, ఇరికించే ‘‘ కుట్ర ’’ జరుగుతోందా..?
ఇక జాతీయ మహిళా కమీషన్ తనపై ఫిర్యాదుపై స్పందించి వేధింపులకు పాల్పడిన ఉన్నతాధికారిపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర పోలీసులకు ఆదేశించిందని తెలిపారు. కానీ సదరు ఉన్నతాధికారి పోలీసులపై ఒత్తిడి తీసుకువచ్చి చర్యలేవీ లేకుండా చేసుకున్నారని బాధిత ఉద్యోగిని తెలిపింది.
ఇలా తనకు ఎక్కడా న్యాయం జరగకపోవడంతో మీ దృష్టికి తీసుకువస్తున్నానని బాధితురాలు వాపోయింది. తనపై వేదింపులకు పాల్పడుతున్న ఉన్నతాధికారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని... లేదంటే తనకే వీఆర్ఎస్ ఇచ్చి పంపాలని సీఎస్ ను బాధిత ఉద్యోగిని కోరింది.
ఇదిలావుంటే అనకాపల్లి జిల్లాలో అమానవీయ ఘటన వెలుగుచూసింది. కన్న కూతురిలా చూసుకోవాల్సిన బాలికపై మారుతండ్రి అత్యాచారానికి పాల్పడ్డాడు. దీంతో భయపడిపోయిన చిన్నారి ఇంటికి వెళ్లడానికే భయపడిపోతుండటంతో తల్లి ఆరా తీయగా విషయం బయటపడింది.
సబ్బవరానికి చెందిన ఓ మహిళ భర్త తొమ్మిదేళ్ల కిందట మృతి చెందాడు. ఇద్దరు ఆడపిల్లలతో ఆమె మగదిక్కు లేకుండా జీవించలేకపోయింది. దీంతో సబ్బవరం సాయి నగర్ కాలనీకి చెందిన 34 ఏళ్ల వ్యక్తిని రెండో వివాహం చేసుకుంది. అతని ద్వారా ఆమెకు మరో అమ్మాయి పుట్టింది. ముగ్గురు పిల్లలతో కలిసే దంపతులు జీవిస్తున్నారు.
అయితే మొదటి కుమార్తె (13) సబ్బవరంలోని ఓ హాస్టల్లో ఉంటూ చదువుకుంటోంది. ఈ క్రమంలో సెలవుల్లో ఇంటికి వచ్చిన సమయంలో ఇంట్లో ఎవరూ లేని సమయంలో మారుతండ్రి నీచానికి పాల్పడ్డాడు.
చిన్నారిని భయపెట్టి, బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఇలా పలుమార్లు ఆమెపై మారుతండ్రి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించడంతో బాలిక మౌనంగా వుండిపోయిది.
అయితే మే నెలలో పాఠశాలలకు వేసవి సెలవులు ఇవ్వడంతో బాలిక అమ్మమ్మ ఇంటికి వెళ్లింది. అమ్మమ్మ ఇల్లు విజయనగరంలో ఉంది. కాగా సెలవులు అయిపోయి స్కూల్స్ తెరిచినా.. బాలిక అక్కడి నుంచి రావడానికి ఇష్టపడలేదు. దీంతో తల్లే స్వయంగా బాలిక ను తీసుకువచ్చి తిరిగి పాఠశాలలో చేర్పించేందుకు వెళ్ళింది. ఆమె సబ్బవరానికి రావడాని ససేమిరా ఒప్పుకోలేదు. దీంతో బాలికను గట్టిగా అడగ్గా తనపై మారుతండ్రి జరిపిన అఘాయిత్యం గురించి వెల్లడించింది.
