మద్యం మత్తులో ఎస్ఐ కూతురు వీరంగం.. వ్యక్తి మృతి

women drunk and drive one killed in hyderabad
Highlights

మద్యం తాగి కారు నడిపిన యువతులు

రాచకొండ పోలీస్ కమిషనరేట్ కుషాయిగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలోని డీఏఈ కాలనీ గేటు వద్ద ఆదివారం అర్ధరాత్రి కారు బీభత్సం సృష్టించింది. ఏఎస్‌రావు నగర్ నుంచి తార్నాక వైపు వస్తున్న స్కోడా కారు డీఏఈ కాలనీ వద్ద రాత్రి 12:30గంటల సమయంలో అదుపు తప్పి డివైడర్ ఎక్కి గోడను ఢీకొంది. ఈ క్రమంలోనే ఫుట్‌పాత్‌పై నిద్రిస్తున్న అశోక్ అనే చెప్పులు కుట్టుకునే వ్యక్తిపై నుంచి కారు దూసుకెళ్లింది.

తీవ్రంగా గాయపడిన అతడిని స్థానికులు హుటాహుటిన గాంధీ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందాడు. కారులో నలుగురు బీటెక్ విద్యార్థినులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. శ్రీనిధి కళాశాలకు చెందిన విద్యార్థినులు పార్టీకి వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.ప్రమాద సమయంలో కారులో ఈశాన్య, సృజన, అమృత, హారిక అనే నలుగురు అమ్మాయిలు ఉన్నారు.

వీరిలో హారిక అనే అమ్మాయి మలక్ పేట సీఐ గంగారెడ్డి కూతురుగా గుర్తించారు. సీఐ కూతురు ఉండటంతో.. తమకు పోలీసులు న్యాయంచేయడం లేదని బాధిత కుటుంబీకులు ఆరోపిస్తున్నారు.కాగా.. పోలీసుల వాదన మాత్రం వేరేలా ఉంది. ప్రమాదం సమయంలో కారు నడుపుతున్న అమ్మాయి మద్యం సేవించి లేదని వారు చెబుతున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో ఈశాన్య రెడ్డి కారు నడుపుతున్నట్లు తెలుస్తోంది.

loader