కారులో ఎంతసేపు ఉండగలరు.. మా అంటే ఒక పూట, ఒక రోజు.. అంతే కదా.. కానీ ఈ మహిళ ఏకంగా రెండేళ్లుగా కారులోనే ఉంటోంది. అదే ఆమె నివాసం.. అదీ నడీరోడ్డుపై కాపురం.. ఎందుకో తెలియాలంటే.. 

హైదరాబాద్ : ఒంటిస్తంభం మేడలో ఉన్నా మహిళలు ఒంటరిగా ఉన్నారంటే చాలు.. ఏదో రకంగా అఘాయిత్యానికి, వేధింపులకు పాల్పడుతున్న ఈ కాలంలో.. మహిళల రక్షణ పెద్ద ప్రశ్రార్థకంగా మారిన సమయంలో ఓ మహిళ.. ఒంటరిగా.. రెండేళ్లుగా.. నడిరోడ్డులో.. ఓ పాడుబడిన కారులో ఉంటోంది. ఆశ్చర్యంగా అనిపించినా.. ఇది నిజం.. అది కూడా ఎక్కడో కాదు హైదరాబాద్ మహానగరంలో... నిత్యం జనసంచారం ఉండే ఏరియాలో...

ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు.. పేరు తప్ప ఇంకేమీ చెప్పడంలేదు.. తన పేరుతోనే రిజిస్టర్ అయి ఉన్న carలో ఓ woman ఏకంగా రెండేళ్ల నుంచి నివాసం ఉంటుంది. హైదరాబాద్ నగరంలో ఎస్సార్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మధురానగర్ మెయిన్ రోడ్డులో ఉన్న పాడైన కారులో మహిళను పోలీసులు గుర్తించారు. ఇన్స్పెక్టర్ సైదులు తెలిపిన వివరాల ప్రకారం… మధురానగర్ లోని మెయిన్ రోడ్డులో రెండేళ్లుగా ఉన్న ఓ Maruti Omni కారులో మహిళ నివాసం ఉంటున్న స్థానికులు అందించిన సమాచారంతో మంగళవారం పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ఆ మహిళతో మాట్లాడారు.

ఆమె తన పేరు గుర్రం అనిత (30) అని చెప్పడంతో ఇతర వివరాల కోసం ఆరా తీశారు. అనిత స్థానికంగా ఉన్న రాజ్ ధూత్ హాస్టల్ లో ఉండేది. ఫీజు చెల్లించకపోవడంతో రెండేళ్లక్రితం హాస్టల్ నిర్వాహకులు ఖాళీ చేయించారు. దీంతో తన సామాగ్రి తీసుకుని అప్పటినుంచి కారులోనే ఉంటుంది. కారుని ఇంటిగా మార్చుకుని ఉంటున్న అనితకు స్థానికులు ఆహారం అందజేస్తున్నారు. అందులోనే నిద్రపోతూ రోజంతా అందులోనే కూర్చుంటుంది. రోడ్డుపై నిలిపి ఉంచినందుకు రెండేళ్లుగా ట్రాఫిక్ పోలీసులు జరిమానా కూడా విధించారు. మహిళకు కౌన్సిలింగ్ ఇచ్చిన పోలీసులు ఇలా కారులో ఉండటం శ్రేయస్కరం కాదని, స్టేట్ హోమ్ కు తరలించి ఆశ్రయం కల్పిస్తామని తెలిపారు. అందుకు అనిత అంగీకరించలేదు. ఆమెకు మరోసారి కౌన్సిలింగ్ ఇస్తామని ఇన్స్పెక్టర్ తెలిపారు. 

ఇదిలా ఉండగా, bank సిబ్బంది నిర్లక్ష్యం ఓ వృద్ధుడి ప్రాణాల మీదికి తెచ్చింది. jublee hills బ్యాంక్ సిబ్బంది నిర్వాకం ఓ వృద్ధుడిని 18 గంటల పాటు బ్యాంకు లాకర్ గదిలో ఉండేలా చేసింది. ఈ ఘటన హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ union bankలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 67 లో 84 ఏళ్ల వ్యాపారి కృష్ణారెడ్డి నివాసముంటున్నారు. ఆయన సోమవారం సాయంత్రం 4.20 గంటలకు ఒక పని మీద జూబ్లీహిల్స్ check postలోని యూనియన్ బ్యాంకుకు వెళ్లారు. 

లాకర్ గదిలోపల కృష్ణారెడ్డి ఉండగానే సిబ్బంది గమనించకుండా దాన్ని మూసివేయడంతో ఆయన రాత్రంతా అందులోనే గడపాల్సి వచ్చింది. రాత్రియినా, ఎంత సేపటికీ కృష్ణారెడ్డి ఇంటికి రాకపోవడంతో ఆయన కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో మంగళవారం ఉదయం పోలీసులకు అనుమానం వచ్చి సీసీ ఫుటేజీలను పరిశీలించగా బ్యాంకు లాకర్ గదిలో కృష్ణారెడ్డి ఉన్నట్టు గుర్తించారు. వృద్ధుడికి మధుమేహం ఉండడంతో ఆయన్ను వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.