సూర్యపేట జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. సూర్యపేట పట్టణంలోని మినీ ట్యాంక్‌బండ్‌ సద్దుల చెరువులోకి ఓ వివాహిత ఇద్దరి పిల్లలతో దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. కొడుకు హర్షవర్ధన్ (9), కూతురు జ్యోతిమాధవి(6) మృతిచెందగా.. తల్లి నాగమణి మాత్రం ప్రాణాలతో బయటపడింది. 

పెన్‌పహాడ్ మండలం సింగిరెడ్డి పాలెం గ్రామానికి చెందిన నాగమణితో ప్రశాంత్ కుమార్ 2006లో ప్రేమ వివాహం చేసుకున్నారు. భార్యాభర్తల మధ్య గొడవల కారణంగానే ఆత్మహత్యకు పాల్పడినట్లుగా తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు.. చెరువులో ఇంకా ఎవరైనా ఉన్నారేమోనన్న కోణంలో గాలిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆత్మహత్యకు గల కారణాలపై అన్వేషిస్తున్నారు. కాగా.. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.