సారాంశం
బెంగళూరులో అనుమానస్పద స్థితిలో మృతిచెందిన తెలంగాణలోని గోదావరిఖనికి చెందిన ఆకాంక్ష కేసులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.
హైదరాబాద్: బెంగళూరులో అనుమానస్పద స్థితిలో మృతిచెందిన తెలంగాణలోని గోదావరిఖనికి చెందిన ఆకాంక్ష కేసులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆకాంక్షకు ఆమె ప్రియుడు అర్పిత్ హత్య చేసినట్టుగా తెలుస్తోంది. అనంతరం అక్కడి నుంచి అతడు పరారయ్యాడు. వివరాలు.. గోదావరిఖని నగరంలో నివాసం ఉంటున్న జ్ఞానేశ్వర్ రాజస్తాన్ వాసి. అయితే అతడు గోదావరిఖని వలస వచ్చి ఇక్కడే స్థిరపడ్డాడు. గోదావరిఖనిలోనే వ్యాపారం చేసుకుంటున్నారు. అతని కూతురు ఆకాంక్ష గోదావరిలోనే ప్రాథమిక విద్యను పూర్తి చేసింది. ఆమె ప్రస్తుతం సాఫ్ట్‌వేర్ ఇంజనీరింగ్‌గా ఉద్యోగం చేస్తుంది.
ప్రస్తుతం ఆకాంక్ష బెంగళూరులోని కోడిహళ్లిలోని జీవన్‌భీమా నగర్‌లోని ఓ ఇంట్లో మరో యువతితో కలిసి ఉంటోంది. అయితే మంగళవారం తెల్లవారుజామున 5 గంటలకు ఆమె రూమ్‌మేట్ గదికి తిరిగి వచ్చేసరికి ఆకాశ గదిలో శవమై కనిపించింది. ఆమె వెంటనే పోలీసులకు సమాచారం అందించింది. దీంతో అక్కడికి చేరుకున్న పోలీసులు.. ఫ్లాట్‌ను పరిశీలించారు.
ఆ గదిలో ఢిల్లీకి చెందిన ఆకాంక్ష ప్రియుడు అర్పిత్ మొబైల్ ఫోన్, వాలెట్‌ను పోలీసులు కనుగొన్నారు. దిండుతో ఊపిరాడకుండా చేసి ఆకాంక్షను అర్పిత్ హత్య చేసి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. అనంతరం ఎవరికీ అనుమానం రాకుండా ఆమెను తాడుతో ఉరివేసారు. ప్రస్తుతం అర్పిత్ ఆచూకీ కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. ఇక, ఆకాంక్ష మృతదేహాన్ని ఈరోజు గోదావరిఖనికి తీసుకురానున్నారు. ఈ ఘటనతో ఆకాంక్ష కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది.