హాస్టల్ గదిలో ఉరివేసుకొని ఓ మహిళా టెక్కీ ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఒడిశా గంజాంలోని స్వప్నేశ్వర్ ప్రాంతానికి చెందిన రాజ్యలక్ష్మి(25) కొంతకాలం క్రితం హైదరాబాద్ నగరానికి వచ్చింది. మాదాపూర్లో ఉంటోంది.

Also Read జహీరాబాద్ రేప్‌ కేసులో ట్విస్ట్: రోడ్డు ప్రమాదంలో నిందితుడు మృతి, మరొకరికి గాయాలు..

జూబ్లీహిల్స్ లోని ఓ ప్రముఖ ఐటీ కంపెనీలో ఉద్యోగం చేస్తోంది. కాగా.. గుట్టల బేగంపేటలోని సిద్ధివినాయక ఉమెన్స్ హాస్టల్ లో ఉంటూ రోజూ ఆఫీసుకి వెళ్లేది. కాగా మంగళవారం మధ్యాహ్నం హాస్టల్ లోని తోటి రూమ్ మెట్స్ తమ విధుల నిమత్తం ఆఫీసులకు వెళ్లగా రాజ్యలక్ష్మి ఒక్కతే గదిలో ఉంది. రాత్రి 12గంటల 30 నిమిషాల సమయంలో రూమ్ మేట్ నవీన హాస్టల్ కి తిరిగి వచ్చింది.  గదిలోకి వచ్చి చూడగా... రాజ్యలక్ష్మి ఆత్మహత్య చేసుకొని కనపడింది.

చున్నీతో ఫ్యాన్ కి ఉరివేసుకొని వేలూడుతూ కనిపించింది. దీంతో ఆమె వెంటనే హాస్టల్ నిర్వాహకులకు, మాదాపూర్ పోలీసులకు సమాచారం అందించింది. అయితే.. రాజ్యలక్ష్మి ఆత్మహత్యకు గల కారణాలు మాత్రం తెలియరాలేదు.