ఇన్‌స్టాలో రివ్యూలకు రేటింగ్ పేరుతో మోసం: హైద్రాబాద్‌లో టెక్కీ నుండి రూ. 1.50 కోట్లు స్వాహా


సైబర్ నేరగాళ్లు  రోజుకో రకమైన మోసానికి పాల్పడుతున్నారు.   ఇన్ స్టాలో  పేజీలకు  రివ్యూలు  ఇస్తే కమీషన్లు  ఇస్తామని  మహిళా టెక్కీని  మోసం  చేశారు. బాధితురాలు  హైద్రాబాద్ పోలీసులకు  ఫిర్యాదు చేసింది.

Woman  Techie  Cheated  by Cyber crime police in Hyderabad  lns

హైదరాబాద్: ఇన్‌స్టాగ్రామ్ లో  పోస్టులకు  రేటింగ్  ఇస్తామని  మహిళా  సాఫ్ట్ వేర్  నుండి  రూ. 1.50 కోట్లు  వసూలు స్వాహా  చేశారు దుండగులు.  మోసపోయినట్టుగా భావించిన  టెక్కీ  పోలీసులకు  ఫిర్యాదు  చేసింది.  ఇన్‌స్టాగ్రామ్ లో   టెక్కీకి  పరిచయమైన నిందితులు తాము  సూచించిన ఇన్ స్టా పేజీలకు  రివ్యూ రేటింగ్ లు  ఇవ్వాలని  సూచించారు. అలా  చేస్తే  కమీషన్ ను చెల్లిస్తామని  తెలిపారు.  

దీంతో మహిళ  టెక్కీ  ఇన్ స్టా  పేజీలకు  రివ్యూ రేటింగ్ లు  ఇచ్చింది. అయితే ఆ తర్వాత  పెట్టుబడి స్కీం పేరుతో  నిందితులు  ఆమె నుండి డబ్బులు వసూలు  చేశారు.   నిందితులకు  రూ. 1.50  కోట్లను  సైబర్ కేటుగాళ్లు  కొట్టేశారు. అయినా కూడ  మహిళా టెక్కీకి  డబ్బులు రాలేదు.  తాను మోసోపోయినట్టుగా  గ్రహించిన  మహిళా టెక్కీ  పోలీసులకు  ఫిర్యాదు  చేసింది.

 ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు  దర్యాప్తు  చేస్తున్నారు . సైబర్ నేరగాళ్లు  రోజుకో రీతిలో  మోసాలకు  పాల్పడుతున్నారు.  టెక్నాలజీ  ఆధారంగా  కొత్త తరహ మోసాలకు  సైబర్ నేరగాళ్లు పాల్పడుతున్నారు.  పైబర్ నేరగాళ్ల  గురించి  పోలీసులు  వార్నింగ్  ఇస్తున్నా కూడ  దేశ వ్యాప్తంగా  ఏదో  ఒక ప్రాంతంలో  కొత్త తరహ మోసాలకు  గురౌతున్నారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios