సంగారెడ్డి జిల్లా సదాశివపేట మున్సిపాలిటీ శానిటరీ ఇన్స్‌పెక్టర్‌ని చావబాదింది సిద్ధాపూర్‌కు చెందిన మహిళ. వర్షానికి ఇళ్లు కూలిపోయిందని కొత్తగా ఇల్లు కట్టుకోవడానికి లోన్ కోసం మున్సిపల్ కార్యాలయానికి వెళ్లింది. 

సంగారెడ్డి జిల్లా సదాశివపేట మున్సిపాలిటీ శానిటరీ ఇన్స్‌పెక్టర్‌ని చావబాదింది సిద్ధాపూర్‌కు చెందిన మహిళ. వర్షానికి ఇళ్లు కూలిపోయిందని కొత్తగా ఇల్లు కట్టుకోవడానికి లోన్ కోసం మున్సిపల్ కార్యాలయానికి వెళ్లింది. అయితే అక్కడ లోన్ ఇప్పిస్తానని ఆమె ఫోన్ నెంబర్ తీసుకున్న శానిటరీ ఇన్స్‌పెక్టర్ ఆమెను వేధించడం మొదలుపెట్టాడు. నేను చెప్పినట్లు చేస్తే లోన్ వస్తుందని లేదంటే అడ్డుకుంటానని బెదిరించాడు. తరచూ ఫోన్ చేసి వేధించడం , అసభ్యకరంగా మాట్లాడటంతో భర్తకు చెప్పింది సంగీత. ఇద్దరూ మున్సిపల్ కార్యాలయానికి వెళ్లి శానిటరీ ఇన్స్‌పెక్టర్‌ను బయటకు లాక్కొచ్చి దేహశుద్ధి చేశారు. బాధితురాలి కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.