హైదరాబాద్‌ శివార్లలో దారుణం చోటుచేసుకుంది. రంగారెడ్డి జిల్లా కందుకూరు మండల పరిధిలోని  ఓ ఫామ్‌హౌస్‌ మహిళ దారుణ హత్యకు గురైంది. 

హైదరాబాద్‌ శివార్లలో దారుణం చోటుచేసుకుంది. రంగారెడ్డి జిల్లా కందుకూరు మండల పరిధిలోని ఓ ఫామ్‌హౌస్‌ మహిళ దారుణ హత్యకు గురైంది. గుర్తు తెలియని వ్యక్తులు ఆమెను హత్య చేశారు. ఈ ఘటన శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది. వివరాలు.. కందుకూరు మండలం దాసురాపల్లి గ్రామంలోని ఓ ఫాంహౌస్‌లో శైలజా రెడ్డి- సురేందర్‌ రెడ్డి దంపతులు పని చేస్తున్నారు. ఫామ్‌ హౌస్ యజమాని కుటుంబ సభ్యులు అక్కడికి రావడంతో.. సురేందర్ రెడ్డి వారితో కలిసి ఫామ్‌ హౌస్ భవనంలో ఉన్నాడు. 

అయితే శైలజా రెడ్డి మాత్రం సర్వెంట్‌ క్వార్టర్‌లో ఉంది. అయితే రాత్రి 8.30 గంటల ప్రాంతంలో కుక్కలు పెద్దగా ఆపకుండా మెరగడంతో సురేంద్ రెడ్డి.. సర్వెంట్ క్వార్టర్ వద్దకు చేరుకున్నాడు. అయితే అక్కడ తన భార్య శైలజ రక్తపు మడుగులో పడి ఉండటాన్ని గమనించాడు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని వివరాలు సేకరించారు. 

కొందరు వ్యక్తులు ఈ హత్య చేసినట్టుగా పోలీసులు భావిస్తున్నారు. డాగ్ స్క్వాడ్, క్లూస్‌ను రంగంలోకి దించిన పోలీసులు.. ఘటన స్థలంలో శోధన చేపట్టారు. నిందితులను పట్టుకోవడానికి పోలీసులు మూడు బృందాలను ఏర్పాటు చేశారు.