సంచీలో శవం: మూడో భార్యను చంపేసి దుబాయ్ చెక్కేశాడు

Woman murder case solved in Hyderabad
Highlights

 రాష్ట్ర రాజధాని హైదరాబాదులో తీవ్ర సంచలనం సృష్టించిన మహిళ హత్య కేసును పోలీసులు ఛేదించారు. 

హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాదులో తీవ్ర సంచలనం సృష్టించిన మహిళ హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఆమెను భర్తనే హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఆమె శవాన్ని బియ్యం బస్తాలో కుక్కి రైల్వే ట్రాక్ పై పడేశాడు. 

 సోమవారం ఉదయం హైదరాబాదు డబీర్‌పూర్‌ స్టేషన్‌కు కొద్ది దూరంలో బియ్యపు బస్తాలో మహిళ మృతదేహాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. దాంతో వారు అక్కడకు చేరుకుని మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. 

మహిళను కట్టుకున్న భర్తనే హత్య చేశాడని, హతుడు పాతబస్తీకి చెందిన హైదర్ ఖాన్‌గా గుర్తించారు. హత్యకు గురైన మహిళ ఖాన్‌కు మూడో భార్యగా తెలుస్తోంది.
 
ఖాన్ ఇద్దరు భార్యలను వదిలేశాడు. మూడో భార్యను అత్యంత దారుణంగా హత్య చేశాడు. భార్యను హత్య చేసిన అనంతరం ఖాన్ తన ఇద్దరు చిన్నారులతో పాటు దుబాయ్‌ పారిపోయాడు. 

హంతకుడి ఇంటికి వెళ్లిన పోలీసులు అతని తల్లిని అదుపులోకి తీసుకున్నారు. హత్య గురించి తనకు తెలియదని, అలాగే తన కొడుకు పిల్లలతో కలిసి ఎక్కడి వెళ్లారో తెలియదని హతుడి తల్లి పోలీసులకు తెలిపింది.

loader