Asianet News Telugu

డబ్బు కోసం గొడవ.. భర్త పై యాసిడ్ పోసిన భార్య..!

భవిష్యత్తులో తాము జీవించడం కష్టమౌతుందని భావించిన భార్య.. కట్టుకున్న భర్తను చంపేయాలని అనుకుంది. కొడుకు సహాయంతో భర్తను చంపేసింది. 

Woman Kills husband with help of son in koheda
Author
Hyderabad, First Published Jul 6, 2021, 7:27 AM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

ఉన్న కాస్త పొలాన్నీ అమ్మేశాడు.. భార్య, కొడుకు వద్దు అని చెప్పినా వినిపించుకోకుండా.. వంశపారపర్యంగా వస్తున్న భూమిని అమ్మేశాడు. ఆ వచ్చిన డబ్బుతో మద్యం సేవిస్తూ జల్సాలు చేయడం మొదలుపెట్టాడు. ఈ డబ్బంతా ఖర్చు చేస్తే.. భవిష్యత్తులో తాము జీవించడం కష్టమౌతుందని భావించిన భార్య.. కట్టుకున్న భర్తను చంపేయాలని అనుకుంది. కొడుకు సహాయంతో భర్తను చంపేసింది. ఈ సంఘటన కొహెడ మండలం సముద్రాల గ్రామంలో చోటుచేసుకోగా... ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

గ్రామానికి చెందిన కోలిపెల్లి రాజయ్య(50) రైతు. ఆయనకు భార్య, కొడుకు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. అందరికీ పెళ్లిళ్లు జరిగిపోయాయి. వీరికి వారసత్వంగా ఐదు ఎకరాల భూమి ఉంది. మూడు నెలల కిందట దానిలోని 2.5 ఎకరాల భూమిని ఎకరం రూ.9లక్షల చొప్పున విక్రయించాడు. మొత్తం రూ.22.5లక్షల వరకు వచ్చింది.

ఆ మొత్తాన్ని భార్య లక్ష్మి, కుమారుడు నరేష్ లు అడిగినా రాజయ్య ఇవ్వలేదు. ఆ డబ్బుతో రోజూ మద్యం సేవిస్తూ.. జల్సాలు చేస్తున్నాడు. ఈ క్రమంలో.. భార్య, కుమారుడు... రాజయ్యను నిలదీశారు. ఆ డబ్బులు ఇవ్వాలంటూ గొడవ పడ్డారు. ఈ క్రమంలో రాజయ్య పై యాసిడ్ పోశారు. అనంతరం తీవ్రగాయాలపాలైన అతనిని ఆస్పత్రికి తీసుకువెళ్లారు.

మద్యం మత్తులో తానే యాసిడ్ మీద పోసుకున్నాడని వారు  వైద్యులకు తెలియజేశారు. అయితే చికిత్స అందిస్తుండగానే అతను ప్రాణాలు కోల్పోయాడు. అయితే.. అతని మరణంపై అనుమానం ఉన్న గ్రామస్థులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ఈ కేసును సుమోటోగా తీసుకొని దర్యాప్తు చేస్తున్నారు. భార్య, కుమారుడిని అదుపులోకి తీసుకొని విచారించగా.. నేరాన్ని అంగీకరించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. 

Follow Us:
Download App:
  • android
  • ios