Asianet News TeluguAsianet News Telugu

మేడ్చల్‌లో ప్రియుడితో కలిసి భర్త హత్య: రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించే కుట్ర

ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసింది భార్య. రోడ్డు ప్రమాదంలో తన భర్త మృతి చెందినట్టుగా అందరిని నమ్మించే ప్రయత్నం చేసింది. చివరకు పోలీసులకు చిక్కింది. ఈ ఘటన మేడ్చల్ జిల్లాలో చోటు చేసుకొంది.

Woman kills husband in Medchal
Author
Medchal, First Published Jun 30, 2020, 3:32 PM IST


హైదరాబాద్: ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసింది భార్య. రోడ్డు ప్రమాదంలో తన భర్త మృతి చెందినట్టుగా అందరిని నమ్మించే ప్రయత్నం చేసింది. చివరకు పోలీసులకు చిక్కింది. ఈ ఘటన మేడ్చల్ జిల్లాలో చోటు చేసుకొంది.

ఈ ఘటనకు సంబంధించి మేడ్చల్ పోలీసులు మంగళవారం నాడు మీడియాకు వివరాలు వెల్లడించారు. మేడ్చల్ జిల్లా సైరోనిగడ్డ తండాకు చెందిన సురేష్ కు బబితతో ఆరేళ్ల క్రితం పెళ్లి జరిగింది, పెళ్లికి ముందు నుండే బబితకు దుండిగల్ కు చెందిన ప్రేమ్ సింగ్ తో వివాహేతర సంబంధం ఉంది. పెళ్లి తర్వాత కూడ బబిత తన ప్రియుడితో వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తోంది.

తమ బంధానికి ప్రియుడు అడ్డుగా ఉన్నాడని బబిత భావించింది. భర్తను అడ్డు తొలగించుకోవాలని ఆమె భావించింది. ఈ విషయాన్ని ప్రియుడికి చెప్పింది. దీంతో ఏడాది కాలంగా భర్తను హత్య చేసేందుకు ప్రయత్నిస్తోంది. చివరకు ఈ నెల 23వ తేదీన నిందితుల ప్లాన్ సక్సెస్ అయింది.

సురేష్ షామీర్ పేటలోని ఫాంహౌస్ లో పనిచేస్తున్నాడు.  ఫాంహౌస్ లో విధులు ముగించుకొని సురేష్ తన టూ వీలర్ పై ఇంటికి తిరిగి వస్తుండగా సురేష్ ను ఈ నెల 23వ తేదీన డీసీఎంతో డీకొట్టారు. 

అయితే ప్రమాదం జరిగిన స్థలానికి బబిత ప్రియుడు ప్రేమ్ సింగ్ తో పాటు ఆయన స్నేహితులు వచ్చారు. కారులో సురేష్ ను ఆసుపత్రికి తీసుకెళ్తున్నట్టుగా స్థానికులను నమ్మించారు. కారులోనే సురేష్ గొంతు నులిమి హత్య చేశారు. ఆ తర్వాత ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఆసుపత్రికి వెళ్లిన సమయంలో సురేష్ మరణించినట్టుగా వైద్యులు ప్రకటించారు.

ఏడాది కాలంగా రోడ్డు ప్రమాదాల నుండి సురేష్ స్వల్ప గాయాలతో తప్పించుకొన్నాడు. దీంతో కుటుంబసభ్యులకు అనుమానం వచ్చి బబితపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు విచారణ జరిపితే అసలు విషయం వెలుగు చూసింది. ఈ మేరకు నిందితులను అరెస్ట్ చేసినట్టుగా పోలీసులు తెలిపారు.

ఈ కేసులో మొత్తం ఎనిమిది మందిని అరెస్టు చేశారు. వీరిలో ఇద్దరు ఉత్తరప్రదేశ్ కు చెందినవారు.

Follow Us:
Download App:
  • android
  • ios