తోడబుట్టిన అన్నతో అక్రమ సంబంధం పెట్టుకుందో చెల్లి. దీనికోసం కట్టుకున్న భర్తను వదిలేసి అన్నతో పరారయ్యింది. ఈ సంబంధానికి అడ్డుగా ఉన్న ఆరేళ్ల కూతురుని హతమార్చింది.  

కేసముద్రం : ఒకేతల్లి కడుపున పుట్టిన అన్నాచెల్లెళ్లు.. మనుషులం అని మరిచిపోయి జంతువుల్లా ప్రవర్తించారు. చెల్లెను అల్లారుముద్దుగా చూసుకోవాల్సిన అన్న ఆమెతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. అన్నలో అమ్మా,నాన్నల్ని చూసుకోవాల్సిన చెల్లె.. కామంతో ప్రియుడిని చూసుకుంది. వింటుంటేనే ఛండాలంగా అనిపిస్తున్న ఈ మహబూబాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. వీరిద్దరూ కలిసి తమ సంబంధానికి అడ్డుగా ఉన్న ఓ చిన్నారిని దారుణంగా హత్య చేయడం కొసమెరుపు..

వివరాల్లోకి వెడితే.. వారిద్దరు తోడబుట్టిన అన్నా చెల్లెలు.. కానీ కట్టుబాట్లను కాదని వివాహేతర సంబంధం పెట్టుకున్నారు. తన సంబంధానికి అడ్డుగా ఉందని ఆమె తన భర్త ద్వారా పుట్టిన బిడ్డను సోదరుడితో కలిసి కడతేర్చింది. భ్య సమాజం తలదించుకునే ఈ ఘటన మహబూబాబాద్ జిల్లాలో వెలుగుచూసింది. కేసముద్రం మండలం నర్సింహులగూడెంకు చెందిన శిరీషకు కట్టుగూడెంకు చెందిన అశోక్ తో ఏడేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి అనుశ్రీ జన్మించింది. ఈ క్రమంలో ఐదేళ్ల క్రితం శిరీష తన తోడబుట్టిన అన్న పూనెం కుమారస్వామితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. 

తోటి కూలీతో అక్రమ సంబంధం.. భర్తను చంపిన భార్య , తాగిన మైకంలో గుట్టువిప్పిన ప్రియుడు

ఈ విషయం బయటికి తెలియడంతో శిరీష, కుమారస్వామి ఇద్దరూ 8 నెలల వయస్సున్న అనుశ్రీని తీసుకుని గ్రామం నుంచి పారిపోయారు. ఆలేరు, భువనగిరి ప్రాంతాల్లో పౌల్ట్రీ ఫార్మ్ లలో కూలీలుగా పనిచేస్తున్నారు. వీరికి ఇద్దరు కుమారులు జన్మించారు. అనుశ్రీకి ఆరేళ్ల వయసు వచ్చింది. బాలికకు తరచూ అనారోగ్య సమస్యలు వస్తుండడంతో శిరీష, కుమారస్వామి కలిసి అనుశ్రీని గత నెల 24న భువనగిరి జిల్లా మర్రిగూడెం సమీపంలోని పౌల్ట్రీ ఫామ్ లో చంపేశారు. ఆ తర్వాత అనుశ్రీ స్పృహ కోల్పోయింది అని చెబుతూ స్థానిక ఆర్ఎంపీ వద్దకు చికిత్స కోసం తీసుకువెళ్లారు. ఆయన చిన్నారిని పరీక్షించి పాప చనిపోయిందని చెప్పారు.

అదే రోజు రాత్రి వారిద్దరూ పాప మృతదేహంతో నర్సింహులగూడెంకు చేరుకున్నారు. అయితే పాప మృతి పట్ల శిరీష మేనమామకు అనుమానం వచ్చింది. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు వచ్చి పాప మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పంపించారు. పోస్టుమార్టంలో అనుశ్రీ హత్యకు గురైనట్లు నిర్థారణ అయ్యింది. దీంతో పోలీసులు శిరీష, కుమారస్వామిలను అదుపులోకి తీసుకుని విచారించారు. దీంతో వీరిద్దరు నేరాన్ని అంగీకరించారు.