కొమురం భీం జిల్లా ఇటుకల పహాడ్‌ భర్తను ప్రియుడితో కలిసి హత్య చేసిందో భార్య. అనంతరం ఇద్దరూ కలిసి మృతదేహాన్ని పాతిపెట్టారు. అయితే మద్యం తాగిన మైకంలో నిందితుడు అసలు విషయం బయటపెట్టాడు. 

చక్కగా చూసుకునే భర్తను ఇంట్లో పెట్టుకుని పక్కచూపులు చూసింది. మరొకరితో అక్రమ సంబంధం పెట్టుకుని.. చివరికి కట్టుకున్న మొగుడిని కాటికి పంపిందో వివాహిత. కొమురం భీం జిల్లా ఇటుకల పహాడ్‌లో ఈ దారుణం జరిగింది. మధ్యప్రదేశ్‌కు చెందిన దేవేందర్ , పార్వతి భార్యాభర్తలు. కూలి పనుల కోసం ఇక్కడికి వలస వచ్చారు. వీరితో పాటు రామ్ లాల్ అనే మరో వ్యక్తి కూడా వచ్చాడు. అయితే పార్వతి.. రామ్‌లాల్‌తో వివాహేతర సంబంధం పెట్టుకుంది. వీరిద్దరూ ఏకాంతంగా వున్న సమయంలో భర్త చూసి నిలదీశాడు. దీంతో ఇద్దరు కలిసి దేవేందర్‌ను హత్య చేసి పాతిపెట్టారు. తర్వాత తాగిన మైకంలో తోటి కూలీలతో రామ్ లాల్ అసలు విషయం చెప్పడంతో ఘోరం బయటపడింది. రంగంలోకి దిగిన పోలీసులు పాతిపెట్టిన దేవేందర్ మృతదేహాన్ని బయటకు తీశారు. వీరిద్దరికి సహకరించిన మరో వ్యక్తిని కూడా అరెస్ట్ చేశారు.