Asianet News TeluguAsianet News Telugu

ఇద్దరు పిల్లలతో సహా గోదావరిలో దూకిన మహిళ.. బాసరలో ఘటన..

నిర్మల్‌ జిల్లా బాసరలో విషాదం చోటుచేసుకుంది. ఓ మహిళ తన ఇద్దరు పిల్లలతో కలిసి గోదావరి నదిలోకి దూకింది.

Woman Jumps godavari river with two children at basara
Author
First Published Jan 23, 2023, 3:30 PM IST

నిర్మల్‌ జిల్లా బాసరలో విషాదం చోటుచేసుకుంది. ఓ మహిళ తన ఇద్దరు పిల్లలతో కలిసి గోదావరి నదిలోకి దూకింది. ఈ ఘటనలో మహిళతో పాటు ఆమె ఇద్దరు పిల్లలు మృతిచెందారు. మృతులను నిజామాబాద్‌కు చెందిన మానస, ఆమె కొడుకు బాలాదిత్య, కూతురు నవ్యశ్రీ‌లుగా గుర్తించారు. అయితే మానస తన ఇద్దరు పిల్లలతో కలిసి బస్సులో నిజామాబాద్ నుంచి బాసరకు చేరుకుని గోదావరి నది వద్దకు ఆత్మహత్యకు పాల్పడింది. పిల్లలతో సహా నీటిలో వెళ్లి ప్రాణాలను తీసుకుంది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు  ఘటన స్థలానికి చేరుకుని.. గజ ఈతగాళ్లను రంగంలోకి దించారు. 

గజ ఈతగాళ్లు మానస, ఆమె ఇద్దరు పిల్లల మృతదేహాలను వెలికితీశారు. మృతదేహాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు.. పోస్టుమార్టమ్ నిమిత్తం  ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై విచారణ జరుపుతున్నట్టుగా పోలీసులు తెలిపారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios